పవన్ అభిమానులకు మళ్లీ నిరాశే

చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో లాయర్‌గా పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాకు సంబంధించిన లుక్, టీజర్లు ఆకట్టుకోవడంతో.. ఈ సినిమాకోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

pawankalyan

లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్‌లో పవన్ పాల్గొన్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన పవన్ రాజకీయ పర్యటనలలో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 9న నిహారిక పెళ్లిలో పనవ్ పాల్గొననుండగా.. ఆ తర్వాత రాజకీయ పర్యటనలో పవన్ బిజీగా ఉండనున్నాడు. ఈ పర్యటనలు అన్నీ పూర్తయిన తర్వాత పవన్ మళ్లీ వకీల్ సాబ్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు.

షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వకీల్ సాబ్ సినిమా విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాకు విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వచ్చే సమ్మర్‌కు వాయిదా పడే అవకాశముంది. దీంతో పవన్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా సినిమా వస్తే చూడాలనే ఆశతో పవన్ అభిమానులు ఉన్నారు.