Pawan New Look: పవన్ న్యూ లుక్ వైరల్

Pawan New Look: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. దీంతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కాగా.. మరొకటి మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్. అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. తాజాగా షూట్ ప్రారంభం అయినట్లు నిర్మాణ సంస్థ ఒక వీడియోను విడుదల చేసింది.

pawan new look

ఈ వీడియోలో షూటింగ్ స్పాట్‌లో త్రివిక్రమ్‌తో కలిసి పవన్ నడుస్తున్నాడు. ఇక సింపుల్ లుక్‌లో మెడలో ఒక ఎర్ర తాడుతో పవన్ కల్యాణ్ ఇందులో కనిపించాడు. ఇక మరో లుక్‌లో బైక్‌ పై వస్తూ పవన్ కనిపించాడు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు.