హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ కుమారుడు

నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు అయినటువంటి మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ స్కూల్లో చదువుతున్నారు. అయితే ఆ స్కూల్లో అగ్నిప్రమాదం జరగడంతో మార్క్ శంకర్ కు కొన్ని గాయాలు అయినట్లు సమాచారం. అతని కాళ్లు, చేతులు కొంచెం కాలాయని అలాగే ఒక ఊపిరితిత్తులలోకి వెళ్లడంతో అతనికి శ్వాసకు సంబంధించిన ఇబ్బంది కలిగిందని సమాచారం. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ నేడు సాయంత్రం పర్యటన పూర్తిచేసుకుని నేరుగా సింగపూర్ వెళ్తున్నట్లు సమాచారం.