వకీల్ సాబ్ మళ్లీ వాయించబోతున్నాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రంగా ఏప్రిల్ ౯న రిలీజ్ అయిన మూవీ వకీల్ సాబ్. పింక్ రీమేక్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమాకి ఐఎండీబీ ఏడవ స్థానంలో ర్యాంకింగ్ ఇచ్చింది. హిందీ తెలుగు అండ్ తమిళ బాషల్లో రీమేక్ అయిన పింక్ రేటింగ్స్ లో వకీల్ సాబ్ సినిమాకే టాప్ రేటింగ్ వచ్చింది. మెసేజ్ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా బాలన్స్ అయిన ఈ సినిమా ఫస్ట్ మూడు రోజులు బాక్సాఫీస్ ని దున్నేసాయి. నాన్ బాహుబలి రికార్డ్స్ ని బీట్ చేసిన వకీల్ సాబ్ అదే ట్రెండ్ ని కొనసాగించి పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనుకుంటే కరోనా సెకండ్ వేవ్ రావడం, ఏపి గవర్నమెంట్ నుంచి ప్రైస్ రేట్స్ తగ్గించే నిర్ణయం రావడం వకీల్ సాబ్ జోష్ కి బ్రేకులు వేశాయి.

మొదట్లో భారి కలెక్షన్స్ రాబట్టిన వకీల్ సాబ్ ఆ తర్వాత జోష్ తగ్గడంతో ధియేట్రికల్ బిజినెస్ డౌన్ అయిపొయింది. కరోనా తగ్గి త్వరలో థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకశాలు ఉండడంతో దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాని మళ్లీ రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. కరోనా భయం దాటి ప్రేక్షకులని మళ్లీ థియేటర్స్ వరకూ తీసుకోని రావాలి అంటే క్రచ్క్ లాంటి కమర్షియల్ సినిమా కావాలి. అది ఇప్పుడున్న పరిస్థితిలో వకీల్ సాబ్ తో మాత్రమే అవుతుంది. 50 శాతం ఆక్యుపెన్సీతో పెద్ద సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. చిన్న సినిమాలు వచ్చినా, మార్కెట్ పై పెద్దగా ప్రభావం ఉండదు కాబట్టి ఆడియన్స్ ని ధియేటర్ వైపు రప్పించడానికి, ఆడియన్స్ కి ధియేటర్ కి మధ్య గ్యాప్ ని ఫిల్ చేయడానికి వకీల్ సాబ్ మాత్రమే సొల్యూషన్ గా భావించిన దిల్ రాజు, ఎడిటింగ్ రూమ్ లో పక్కన పెట్టిసిన కొన్ని సీన్లు కూడా కలిపి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నాడట. దిల్ రాజు చేస్తున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. పైగా వకీల్ సాబ్ అమెజాన్ లో కూడా రిలీజ్ అయ్యింది, మళ్లీ థియేటర్స్ లో ఈ సినిమా విడుదల అయితే ఈ ఓటిటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అనేది కూడా చూడాలి.