అభిమాన హీరోతో జూనియర్ పవర్ స్టార్ అకిరా.. హైట్ తోనే షాకిస్తున్నాడు

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ కి సంబంధించిన ఒక లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువ హీరో అడివి శేష్ ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా అభిమానులకు అందించాడు. చాలా రోజుల తరువాత అకిరాకు సంబంధించిన ఫోటో కనిపించడంతో పవర్ స్టార్ అభిమానులు ఆ ఫోటోను సోషల్ మీడియాలో మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

అకిరా నందన్ తో ఉన్న అడివి శేష్ చాలా చిన్నగా కనిపిస్తుండడం తో జూనియర్ పవర్ స్టార్ హైట్ తోనే అందరికి షాకిచ్చేలా ఉన్నాడని అనిపిస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఒక్కడే టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఎత్తు కలిగిన హీరో అనుకుంటే అకిరా అంతకంటే ఎక్కువగా 6.4 హైట్ తో ఆశ్చర్యపరుస్తున్నాడు. అందుకు సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక గతంలో రేణు దేశాయ్ తనయుడికి ఇష్టమైన హీరో ఎవరంటే.. ఆడివి శేష్ అని వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.