రాజ్యాన్ని వదిలెళ్లిన రాజు… తిరిగొచ్చే రోజు దగ్గర్లోనే ఉంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈ పేరు థియేటర్ లో వినిపించి రెండేళ్లు అవుతోంది. త్రివిక్రమ్ తో చేసిన 25వ సినిమా అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై ద్రుష్టి పెట్టి పూర్తిగా సినిమాల నుంచి దూరమయ్యాడు. పవర్ స్టార్ గా టాప్ ప్లేస్ లో ఉండగానే జనసేనానిగా మారిన పవన్ కళ్యాణ్, మళ్లీ పవర్ స్టార్ గా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తాడా? ఎప్పుడు ఆ పేరు థియేటర్ లో రీసౌండ్ వినిపిస్తుందా అని మెగా అభిమానులు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటారు. రెండేళ్లు కావొస్తున్నా సోషల్ మీడియాని ఆ పేరు రూల్ చేస్తూనే ఉంటుంది, ఇప్పుడు మళ్లీ తెరపై కనిపించడానికి రెడీ అవుతున్నాడని సమాచారం.

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు, అది కూడా సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా ప్రారంభం కాబోతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇంతకీ పవన్ చేయబోయే సినిమా ఏది అనే కదా మీ డౌట్, బిగ్ బి అమితాబ్ నటించిన పింక్ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. నిజానికి ఈ సినిమాని బాలకృష్ణ హీరోగా అనుకున్నారు కానీ అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్, ఈ రీమేక్ సినిమాకి మాటలు మార్పులు చేయబోతున్నాడు. పవన్ లాయర్ గా కనిపించనున్న ఈ మూవీలో ఒక సీరియస్ గర్ల్ ఇష్యూని డిస్కస్ చేయబోతున్నారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ పవన్ కి అడ్వాన్స్ ఇవ్వడంతో, ఆ బ్యానర్ లోనే పింక్ రీమేక్ తెరకెక్కనుందట. ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రానుంది. రీసెంట్ గా పింక్ సినిమాని తమిళ స్టార్ హీరో అజిత్, నెర్కొండ పార్వై పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. మొత్తానికి జనసేనాని మళ్లీ పవర్ స్టార్ గా మారే రోజు రాబోతోంది మెగా అభిమానులు రెడీగా ఉండండి.