‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్: పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లుక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత ఒక స్పెషల్ లుక్ తో దర్శనమిచ్చాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. గతంలో ఎన్నో రకాల సినిమాలు చేసిన పవన్ వకీల్ సాబ్ లో మాత్రం నెవర్ బిఫోర్ అనేలా కనిపిస్తున్నాడు. బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇక సినిమాకి సంబంధించిన లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒక చేతిలో కర్ర, మరొక చేతిలో క్రిమినల్ లా పుస్తకంతో నల్లకోటు వేసుకొని లాయర్ గా కనిపించిన పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. సత్యమేవ జయతే అనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. ఇక వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గత సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోని విధంగా కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. కొంత షూటింగ్ పార్ట్ కూడా మిగిలి ఉంది. పనులన్నీ ఈ ఏడాదిలోనే ఎండ్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.