దీపావళి శుభాకాంక్షలతో ‘భీమ్లా నాయక్‘ నూతన ప్రచార చిత్రం విడుదల.

  • “లాలా భీమ్లా” పాట నవంబర్ 7 న విడుదల

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.

‘భీమ్లా నాయక్’ నుంచి మరో గీతం విడుదలకానుంది. దీనికి సంభందించి చిత్ర నిర్మాణ సంస్థ ఓ ప్రచార చిత్రాన్ని, డైలాగ్ తో కూడిన వీడియోను విడుదల చేసింది.
ప్రోమో ను పరికిస్తే….” నాగరాజు గారు హార్టీ కంగ్రాట్స్ లేషన్స్ అండి మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది హ్యాపీ దీపావళి” అంటూ కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఎవరినో ఉద్దేశించి అనటం కనిపిస్తుంది. ప్రోమో చివరిలో “లాలా భీమ్లా” పాట నవంబర్ 7 న విడుదల అన్న ప్రకటన కూడా కనిపిస్తుంది.

ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన ‘భీమ్లా నాయక్’ పాత్ర తీరు,తెన్నులు. భీమ్లా నాయక్ దమ్ము, ధైర్యానికి అక్షర రూపంలా, కథానాయకుడి గొప్పదనాన్ని కరతలామలకం చేసేలా సాగిన గీతం, అలాగే విజయదశమి పర్వదినాన విడుదల అయిన ‘అంత ఇష్టమేందయ‘ పాట అభిమాన ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి. వీటికి ముందు పవన్ కళ్యాణ్, రానా ప్రచార చిత్రాలు కూడా సామాజిక మాధ్యమాలు వేదికగా సరికొత్త రికార్డు లను నమోదు చేసిన సంగతి తెలిసిందే.’భీమ్లా నాయక్‘ చిత్రాన్ని తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది అని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మిత మవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్:‘నవీన్ నూలి
ఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: సాగర్ కె చంద్ర