అందాల ప్రదర్శన లేని వీడియోనే లేదు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ న‌టించిన బ‌ద్రీ సినిమాలో హీరోయిన్‌గా చేసిన అమీషా ప‌టేల్ గుర్తుంది క‌దా. గుర్తుండకుండా ఎలా ఉంటుందిలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కదా పైగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ కూడాను. స్టైలిష్ కమర్షియల్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ తెలుగు ప్రేక్షకులకి బాగా దెగ్గరయ్యింది. హిందీలో హ్రితిక్ రోషన్ తో కహా నా ప్యార్ హై మూవీ చేసి బద్రి రిలీజ్ అయిన 2000వ సంవత్సరంలోనే అక్కడ కూడా డెబ్యూ ఇచ్చింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో అమీషా పటేల్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. గదర్, హమ్రాజ్, ఆప్ ముఝే అచ్చా లగ్నే లాగా సినిమాలతో బాలీవుడ్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న అమీషా పటేల్, 2004లో మళ్లీ తెలుగు ప్రేక్షకులని పలకరించింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన నాని మూవీలో అమీషా పటేల్ మళ్లీ టాలీవుడ్ లో మెరిసింది. ఇదే సినిమాని ఎస్.జే సూర్య తమిళ్ లో వాడా అనే పేరుతో రీమేక్ చేశాడు, అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి అమీషా పటేల్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇలా 2004లో ఒకేసారి నాలుగు సినిమాలు చేసిన అమీషా పటేల్, 2005లో ఎన్టీఆర్ నటించిన నరసింహుడు మూవీలో ఒక హీరోయిన్ గా కనిపించింది. అక్కడి నుంచి ఆరేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న అమీషా పటేల్, 2011లో బాలయ్య నటించిన పరమవీర చక్ర మూవీలో కథానాయికగా నటించింది. ఈ రెండు సినిమాలు అనుకున్నంత రిజల్ట్ ఇవ్వకపోవడంతో అమీషా పటేల్ కి తెలుగు నుంచి అవకాశాలు తగ్గాయి కానీ బాలీవుడ్ లో మాత్రం వరసగా సినిమాలు చేస్తూనే ఉంది. స్పీడ్ కాస్త తగ్గించినా కూడా మంగళ్ పాండే, హే బేబీ, భూల్ బుల్లయ్యా, రేస్ 2 సినిమాలు సినిమాల్లో మంచి రోల్స్ లో మెరుస్తూనే ఉంది. ముఖ్యంగా రేస్ 2లో అనీల్ కపూర్ పక్కన అమీషా పటేల్ చేసిన స్కిన్ షో చూసి ఈమెలో అందం ఇంకా తగ్గలేదు అనుకున్న వాళ్లు ఎంతో మంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి అదే గ్లామర్ ని మైంటైన్ చేసిన 44 ఏళ్ల వయసున్న అమీషా పటేల్ కి అవకాశాలు తగ్గడంతో సినిమాలకి పూర్తిగా దూరం అయ్యి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పటికీ జిమ్ గా ఉండే ఈ వెటరన్ బ్యూటీ ఇన్స్టాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడూ ఎదో ఒక ఫోటో వీడియో పోస్ట్ చేస్తూ ఫాలోవెర్స్ కి కిక్ ఇస్తూ ఉంటుంది. 3.9 మిలియన్ ఫాలోవర్స్ కి అమీషా పటేల్ ప్రతి వీడియోలో గ్లామర్ షోకి మాత్రం అస్సలు తక్కువ చేయదు. ఎక్కడా ఏ లోటు ఏ లేకుండా అందాల ప్రదర్శన చేసే ఈ బాలీవుడ్ డీవా దేశీ మ్యాజిక్ అనే సినిమాతో పాటు ఫౌజీ బ్యాండ్ అనే మూవీ చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాలు పోస్ట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి.