గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో మరోసారి వర్క్ చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పింక్ రీమేక్ వకీల్ సాబ్ అయిపోయిన తరువాత వెనువెంటనే క్రిష్, హరీశ్ శంకర్ సినిమాలను పట్టాలెక్కించాలని పవన్ ప్లాన్ వేసుకుంటున్నాడు. ఈ కాంబినేషన్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్ పై మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒక క్లారీటి ఇచ్చింది. సెప్టెంబర్ 2న సాయత్రం 4గంటలకు సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తెస్తారో చూడాలి. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ కి ఎలాగైనా ఫీనిషింగ్ టచ్ ఇవ్వాలని చూస్తున్నాడు. షూటింగ్స్ మొదలైతే హరీష్ ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.