Powerstar: స‌రికొత్త‌ మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న‌ ప‌వ‌న్ క‌ళ్యాన్.. శిక్ష‌కుడికి ఆర్థిక సాయం!

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సోష‌ల్ మీడియాలో కానీ, బ‌య‌ట గానీ త‌న‌కు ఏదైనా న‌చ్చితే వారిని గౌర‌వంగా స‌త్క‌రంచ‌డమో లేదా ఆర్థిక సాయం అందించ‌డ‌మో తెలిసిన విష‌య‌మే. ఈ నేప‌థ్యంలోనే తాజాగా Powerstar ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెల్లూరు జిల్లాకు చెందిన మార్ష‌ల్ ఆర్ట్స్ శిక్ష‌కుడు, గిన్నిస్ రికార్డు గ్ర‌హీత ప్ర‌భాక‌ర్ రెడ్డిని స‌త్క‌రించారు.. దీంతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ లెర్నింగ్ సెంట‌ర్ ఫ‌ర్ లెన్స్ ట్ర‌స్టు ద్వారా ప్ర‌భాక‌ర్‌రెడ్డికి రూ.1ల‌క్ష ఆర్థిక సాయం కూడా అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా Powerstar ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ..

వింగ్ చున్ అనే పోరాట విద్య గురించి, ఆ విద్య‌ను మ‌న దేశంలో నేర్పే గురువుల గురించి ఇంట‌ర్నెట్లో వెదుకుతుంటే ప్ర‌భాక‌ర్‌రెడ్డి గురించి తెలిసింద‌ని వెల్ల‌డించారు. మార్ష‌ల్ ఆర్ట్స్‌లో విదేశాల్లో శిక్ష‌ణ తీసుకుని.. అనేక‌మైన అవార్డుల‌ను సొంతం చేసుకున్న ప్ర‌భాక‌ర్‌రెడ్డి పెద్ద పెద్ద న‌గ‌రాల‌కు వెళ్ల‌కుండా త‌న సొంతూళ్లోనే ఉంటూ యువ‌త‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డం సంతోష‌క‌రంగా ఉంద‌ని అన్నారు.. ప్ర‌భాక‌ర్ రెడ్డి వంటి వారిని ప్రొత్సాహించాల‌న్న ఉద్దేశ్యంతో త‌మ ట్ర‌స్టు ద్వారా ఆర్థిక సాయం అంద‌జేశామ‌ని ప‌వ‌న్ చెప్పారుPowerstar .