
విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ వారు తలసేమియా బారిన పడి అనారోగ్య పాలైన వారికోసం నిర్వహిస్తున్న మ్యూజికల్ కన్సర్ట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు హాజరు కావడం జరిగింది. తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా’ పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ తమన్ విజయవాడలో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు సాదరంగా స్వాగతించారు. అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ వారు ఎంతో కష్టపడి తలసేమియా బారిన పడిన వారికి సాయంగా నిలబడ్డారని, వారికి సహాయం చేయడం కోసం తన తరఫున 50 లక్షల రూపాయలు విరాళంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆయన స్వాగతించారు.