అయోధ్య రామమందిర నిర్మాణానికి పవన్ భారీ విరాళం

అయోధ్య రామమందిర నిర్మాణానికి ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, పలువురు ప్రముఖులు విరాళం ప్రకటించారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయోధ్య రామాలయ నిర్మాణం కోసం భారీ విరాళం ప్రకటించారు.

pawan donates ayodya temple

రూ.30 లక్షల విరాళం పవన్ ప్రకటించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. అనంతరం ఈ విరాళం ప్రకటించారు. ఏడాదికాలంగా తిరుపతికి రావాలని అనుకుంటున్నానని, కరోనా కారణంగా కుదరలేదని పవన్ చెప్పారు.