
హిందూపురం శాసన సభ్యులు, ప్రముఖ కథానాయకులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ‘పద్మభూషణ్’ పురస్కారం స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శ్రీ బాలకృష్ణ గారి కి ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రల్లో ఆయన శైలి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొంటుంది. ప్రజా సేవలో, కళా సేవలో శ్రీ బాలకృష్ణ గారు మరిన్ని మైలు రాళ్ళు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
