‘పవన్ కళ్యాణ్’ బర్త్ డే స్పెషల్.. ఆమె సపోర్ట్ వల్లే ‘హీరో’ అయ్యాడు!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులను ఏ స్థాయిలో ఆదరిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నేడు ఆయన 49వ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు భారీ స్థాయిలో విషెస్ అందిస్తున్నారు 1996 లో పవన్ కళ్యాణ్ అక్కాడ అమ్మాయి ఇక్కాడా అబ్బాయి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు.

పవన్ ఒక హీరో కంటే కూడా ఒక తన రియల్ లైఫ్ వ్యక్తిత్వంతోనే అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నాడు. అందరి హీరోలకు అభిమానులు ఉంటే ఆయనకు మాత్రం భక్తులు ఉంటారనేది జగమెరిగిన సత్యం. రెండు దశాబ్దాలుగా ఈ రోలర్-కోస్టర్ కెరీర్‌లో పవన్ 25 చిత్రాలలో కథానాయకుడిగా నటించాడు. దర్శకుడిగా నిర్మాతగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, ప్లేబ్యాక్ సింగర్ గా ఇలా అన్ని రకాలుగా తన టాలెంట్ ని వెండితెరపై ఉంచాడు.

ఇక వ్యక్తిత్వంలో పవన్ అభిమానులను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాడు. ఆయన కెరీర్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా ఇండస్ట్రీ రికార్డుకను క్రియేయ్ చేశాడు. తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా వంటి సినిమాలు ఓవన్ యాక్టింగ్ స్టామినాకు ఒక నిదర్శనం. ఇక గబ్బర్ సింగ్ తో సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేశాడనే చెప్పాలి.

ఇక పవర్ స్టార్ అసలు పేరు కొనిదేల కల్యాణ్ బాబు అని చాలామందికి తెలియదు. కరాటేలో తన నైపుణ్యాలను ప్రదర్శించడానికి మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నప్పుడు, అతను పవన్ అనే ఒక స్టేజ్ పేరును తీసుకున్నాడు. అసలు పవన్ కి మొదట సినిమాల్లోకి రావాలని పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. సమజాసేవ చేయాలని రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. అయితే, చిరంజీవి భార్య సురేఖా అతన్ని నటుడిగా మారమని ఒప్పించి చాలా ప్రోత్సహించింది.

ఖుషి’, ‘తీన్ మార్’, ‘బద్రీ’, ‘జానీ’ వంటి పలు చిత్రాలకు స్టంట్ కోఆర్డినేటర్-కమ్-హీరోగా కూడా పనిచేశారు. ఇక అతని హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ‘తమ్ముడు’, ‘బద్రి’ మరియు ‘ఖుషి’ తరువాత, అనేక కంపెనీలు తమ ఉత్పత్తులకు ప్రచారాలు చేయాలని పవన్ ముందు క్యూలో నిలబడ్డాయి. కొన్నాళ్లు చేసిన తరువాత కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినప్పటికీ జనాలను మనం మోసం చేయకుడదని, ఏ బ్రాండ్‌ను ప్రోత్సహించకూడదని పవన్ నిర్ణయించుకున్నాడు.

2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గూగుల్ లో అత్యధికంగా శోధించిన భారత ప్రముఖ రాజకీయ నాయకులలో పవన్ ఒకరు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో రాజకీయాల్లో కొనసాగుతూనే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సినిమాలు కూడా చేస్తున్నాడు.