అమర సైనికుడు మురళి నాయక్ అంత్యక్రియలలో పాల్గొన్న పవన్ కళ్యాణ్

దేశ సరిహద్దులలో జరుగుతున్న యుద్ధంలో తెలుగు సైనికుడు అమరుడయ్యాడు. అతని అంత్యక్రియలలో నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి 50 లక్షలు నగదు, 5 ఎకరాల పొలం, 300 గజాల ఇళ్ల స్థలంతోపాటు వారి కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తామని పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వగతంగా 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వనున్నట్లు తెలిపారు.