‘పవన్ కళ్యాణ్’ 30వ సినిమా కూడా సెట్టయినట్లే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ అనేలా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఊహించని అప్డేట్స్ వచ్చాయి. పైగా పవన్ కళ్యాణ్ కి అభిమానులతో పాటు చాలా మంది సినీ తారలు కూడా సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వకీల్ సాబ్ సినిమాతో పాటు వరుసగా మరో మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేశాయి.

క్రిష్, హరీష్ శంకర్ సినిమాతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక 30వ ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ దర్శకత్వంలో లేదా భీష్మ దర్శకుడు వెంకీ కుడుములు తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీతార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఆ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక ఆ విషయంలో క్లారిటీ రావాలి అంటే ముందు షూటింగ్ దశలో ఉన్న రెండు సినిమాలు ఫినిష్ చేయాల్సిందే.