షూటింగ్‌లో పవన్.. ఫొటో వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కాగా.. మరొకటి అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్‌. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమవ్వగా.. ఈ షూటింగ్‌లో తాజాగా పవన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా షూటింగ్‌లోని పవన్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

pawan ayyappanum koshiyum look

ఇందులో పవన్ కుర్చీలో కూర్చోని ఉండగా.. చేతికి రుమాల్ కట్టుకుని ఉన్నాడు. రుమాల్ మీద జానీ అని రాసి ఉంది. గతంలో జానీ సినిమాలో ప్యాంటుకు పవన్ రుమాల్ కట్టుకోవడం అప్పట్లో ట్రెండీగా మారింది. ఈ ట్రెండ్‌ను యూత్ బాగా ఫాలో అయ్యారు. ఇక గుడుంబా శంకర్ సినిమాలో పవన్ తలకు రుమాల్ కట్టుకోగా.. అది కూడా అప్పట్లో యూత్‌కి బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ కొత్త సినిమాలో చేతికి పవన్ రుమాల్ కట్టుకోవడం ఆసక్తికరంగా మారింది.