త్వరలో ప్రదీప్‌తో పవన్ కల్యాణ్

యాంకర్‌గా గుర్తింపు పొందిన ప్రదీప్… 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై కూడా అడుగుపెట్టాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్‌ను అందుకుంది. పాటలతో పాటు కామెడీ బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. దర్శకుడు మున్నా ఈ సినిమాను తెరకెక్కించగా. ఎస్వీ బాబు నిర్మించారు. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. అనూప్ మ్యూజిక్ అందించాడు.

PAWAN ATTEND PRADEEP SHOW

అయితే ఈ సినిమా రిలీజ్ అయి వారం కాకముందే ఈ లోపే హీరోగా మరో సినిమా చేయనున్నట్లు ఇటీవల ప్రదీప్ ప్రకటించాడు.

ఇది ఇలా ఉంటే జీటీవీలో కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా ఐదో సీజన్‌ను త్వరలో ప్రదీప్ ప్రారంభించనున్నాడు. దీనికి గెస్ట్‌గా పవన్ స్టార్ పవన్ కల్యాణ్ రానున్నాడని సమాచారం. పవన్‌ సర్ ఎప్పుడో రావాలని, కానీ బీజీ షెడ్యూల్ వల్ల కుదరలేదని ప్రదీప్ చెప్పాడు . ఈ సారి పవన్ వస్తున్నారన్నాడు.