వీరమల్లుగా పవన్ కల్యాణ్

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అయితే ఈ సినిమా టైటిల్‌కి సంబంధించి ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమాకి వీరమల్లు అనే టైటిల్ కన్ఫామ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్‌ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో రిజిస్టర్ చేయించినట్లు సమాచారం.

pawan new movie rachamallu

పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రాబిన్ హుడ్ తరహా పాత్రను పవన్ పోషిస్తున్నాడు. 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను క్రిష్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుండగా.. అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశముంది.