Powerstar: క్రిష్‌ మూవీ నుంచి ప‌వ‌ర్‌స్టార్ ఫోటో లీక్‌.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబోలో పీఎస్‌పీకే27 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత ఏ.ఎమ్‌.ర‌త్నం నిర్మిస్తుండ‌గా.. ఇందులో ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, జాక్వెలిన్ ఫేర్నాండేజ్ హీరోయిన్ల్‌గా న‌టిస్తున్నారు ‌.. అలాగే బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఈ చిత్రం చారిత్ర‌క క‌థాంశంతో తెర‌కెక్కుతుండ‌గా..Powerstar ప‌వ‌న్ ఈ సినిమాలో రాబిన్‌హుడ్ త‌ర‌హ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. కాగా ఈ చిత్ర షూటింగ్ కొంత జరుపుకుంది.. కానీ లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింది.. ఇటీవ‌లే కొత్త షెడ్యూల్ ప్రారంభం కాగా..

ఈ చిత్రానికి హ‌ర‌హ‌ర వీర‌మ‌ల్లు అనే టైటిల్‌ను చిత్ర‌బృందం ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో రిజిష్ట‌ర్ చేయించార‌ని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంకు సంబంధించి ప‌వ‌న్ లుక్ లీక్ అయింది.. ఇది కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. పాత‌బ‌స్తీకి చెందిన ప‌హిల్వాన్ల‌తో Powerstarప‌వ‌న్ కుస్తీ చేసే సీన్స్ చేస్తున్న‌ట్లుగా అందులో కొన్ని సీన్స్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే ప‌వ‌న్ న‌టించిన వ‌కీల్‌సాబ్ చిత్రం కంటే క్రిష్ మూవీ చిత్రంపై అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అందువ‌ల్ల ఈ సినిమా నుంచి ఏదైనా అప్‌డేట్ కోసం ప్రేక్ష‌కులు చూస్తున్న స‌మ‌యంలో ఆ టైం రానేవ‌చ్చేసింది. ఏకంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కల్యాణ్ లుక్ లీక్ అయింది.. దీంతో ఆ లుక్‌లో Powerstarప‌వ‌న్‌ను చూసి ప్రేక్ష‌కులు, ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంతో ఫిదా అవుతున్నారు. ఇక Powerstarప‌వ‌న్‌-క్రిష్ మూవీకి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణీ స్వ‌రాలు అందిస్తున్నారు.