Powerstar: ప‌వ‌ర్‌స్టార్ మూవీ షూరు అయింది..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌రుస సినిమాల‌తో ఫుల్ జోష్ మీదున్నారు. ప‌వ‌న్ న‌టించిన తాజా చిత్రం వ‌కీల్‌సాబ్ ఇటీవ‌లే షూటింగ్ ముగిసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర‌బృందం. అనంత‌రం ప‌వ‌న్‌-క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఓ చిత్రం హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో షూటింగ్ జ‌రుగుతుంది. దీంతో పాటు మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ మూవీ అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్ చిత్రంలో న‌టిస్తున్నాడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

powerstar

Powerstar సితార బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం12గా వ‌స్తున్న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ వీడియోలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మైంద‌ని.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సెట్స్‌లో అడుగుపెట్ట‌డం చూపించారు. అలాగే ప‌వ‌న్‌తో పాటు త్రివిక్ర‌మ్‌, ఈ చిత్ర డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె.చంద్ర ఈ వీడియోలో కనిపిస్తారు. ఇక ఈ చిత్రంలో Powerstar ప‌వ‌న్‌తో పాటు ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్నారు. సాగ‌ర్ కె. చంద్ర డైరెక్ష‌న్‌లో పీడీవీ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు.‌