Powerstar: బిగ్‌బాస్ న‌టికి ప‌వ‌న్ లేఖ‌.. వ‌స్తాద్‌ల‌తో ఉస్తాద్‌!

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ అంటే ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. ఆయ‌న‌కు ఫ్యాన్స్ ఉండ‌రు భ‌క్తులే ఉంటార‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ప‌వ‌న్ సినిమా వ‌స్తుందంటే అభిమానులు పూజ‌లు, పాలాభిషేకాలు చేస్తుంటారు. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకే మాదిరిగా ఉంటే స్టార్ హీరో ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్‌కళ్యాన్ మాత్ర‌మే అని అంద‌రూ చెబుతుంటారు. అలాగే ఆయ‌నకు అభిమానుల్లో ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఉంటార‌నే విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌నతో స్ర్క్రీన్ పంచుకోవడానికి ఎంతో మంది న‌టీన‌టులు ఆతృత‌గా ఎదురుచూస్తారు. అయితే Powerstarప‌వ‌న్ తాజా సినిమా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌తుంద‌నే తెలిసిందే.

Powerstar

ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌లే ఆమె నా క‌ళ నెర‌వేరిన‌ట్టు అనిపిస్తుంది అని ట్వీట్ చేసింది. అలాగే Powerstarప‌వ‌న్ తో న‌టించ‌డానికి ఛాన్స్ ద‌క్కించుకుంది బుల్లితెర న‌టి, బిగ్‌బాస్ ఫేం హిమ‌జ‌. ఈ విష‌యంపై ఆమెకు ప‌వ‌న్ క‌ళ్యాన్ లేఖ రాశారు. న‌టి హిమ‌జ గారికి, మీకు అన్ని శుభాలు జ‌ర‌గాల‌ని, వృత్తిప‌రంగా మీరు ఉన్న‌త‌స్థాయికి వెళ్లాల‌ని కోరుకుంటున్నాను అని Powerstarప‌వ‌న్ లేఖ రాశారు. దీంతో హిమ‌జ‌కు ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. త‌న ఆనందాన్ని మాట‌ల్లో లేదా ఎమోజీల్లోనూ చెప్ప‌లేక‌పోతున్నాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా ప‌వ‌న్ లేఖ‌ను పోస్ట్ చేసింది హిమ‌జ‌. ఇక మ‌రోవైపు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఈ చిత్రంలో ప‌నిచేసిన ప‌హిల్వాన్ల‌ను నిన్న స‌త్క‌రించిన విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రం పీరియాడిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతుండ‌గా.. ప‌వ‌న్ విభిన్న‌మైన లుక్‌లో క‌నిపించ‌నున్నారు. ఇందులో ఆయ‌న రాబిన్‌హుడ్ త‌ర‌హా పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఇక ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఈ సినిమా షూట్ జ‌రుగుతుంది.. ఈ Powerstarచిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఏఎం ర‌త్నం నిర్మిస్తుండ‌గా.. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.