Powerstar: అయ‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్.. ప‌వ‌న్ స్టిల్‌ లీకవ్వ‌డంతో మూవీ టీం ఆవేద‌న‌!

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాన్, భ‌ళ్లాల‌దేవ రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో మ‌ల‌యాళ హిట్ మూవీ అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు ఫేం డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రంలో ప‌వ‌న్ లుక్.. గెట‌ప్ ఎలా ఉంటుందో చూపించారు చిత్ర‌బృందం. దీంతో పవ‌న్ ఫ్యాన్స్ ఎంతో ఖుషీ అయ్యారు. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో Powerstar ప‌వ‌న్ తో కీల‌క‌మైన‌ స‌న్నివేశం షూట్ చేస్తుండ‌గా..

Power

మానిట‌ర్ లో క‌నిపిస్తున్న ప‌వ‌న్ ను ఫోటో క్లిక్ మ‌నిపించారు. దీంతో లీకైన ప‌వ‌న్ స్టిల్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ విష‌యంపై ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ర‌ట‌. ఈ లీకైన ఫోటోలో Powerstar ప‌వ‌న్ వెనుక పోలీసులు లాఠీలు ప‌ట్టుకుని క‌నిపిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తుండ‌గా.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌క‌రుస్తున్నారు.‌‌