Pawan-Krish Movie: ప‌వ‌ర్‌స్టార్‌ను ఢీ కొట్ట‌బోతున్న ప‌హిల్వాన్ల్‌..

Pawan-Krish Movie: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి కాంబోలో పిఎస్‌పీకే27 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత ఏఎమ్ ర‌త్నం భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. 17వ శ‌తాబ్దం కాలం నాటి పీరియాడిక‌ల్ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం కోసం చార్మినార్, ఓ భారీ సంస్థానం సెట్‌ల నిర్మాణం చేప‌ట్టారు. తాజాగా Pawan-Krish Movieఈ సినిమాకు సంబంధించి ఓ పాట‌ను చిత్రీక‌రించిన‌ట్లు కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేశ్ మాస్ట‌ర్ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. ఈ పాట తెర మీద దుమ్ము లేచిపోద్ది… అలాగే దీంట్లో ప‌వ‌ర్‌స్టార్ ఓ రేంజ్‌లో అద‌ర‌గొట్టేశాడ‌ని గ‌ణేశ్ మాస్ట‌ర్ చెప్పుకొచ్చాడు.

ఇక తాజాగా ఈ చిత్రం ఫైట్ సీన్‌ను చిత్రీక‌రించారు చిత్ర‌బృందం. Pawan-Krish Movieఇందులో ప‌హిల్వాన్‌ల‌తో హై ఓల్టేజ్ యాక్ష‌న్ సీక్వెన్స్‌ని షూట్ చేస్తున్న‌ట్లు కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక ఇందులో ప‌వ‌న్ గుర్ర‌పు స్వారీ, క‌త్తి సాము వంటి విన్యాసాల‌ను చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఇక Pawan-Krish Movieఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది.. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణీ స్వ‌రాలు స‌మ‌కురుస్తున్నారు.