CM Kcr: సీఎం కేసీఆర్‌కు ప‌వ‌న్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు..

CM Kcr: సీఎం కేసీఆర్ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా రాజ‌కీయ ప్ర‌ముఖులు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తాజాగా సీఎం కేసీఆర్‌కు ప‌వ‌ర్‌స్టార్ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. తాను అభిమానించే స‌మ‌కాలీక రాజ‌కీయ‌వేత్త‌ల్లో CM Kcrకేసీఆర్ గారు ఒక‌ర‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు.

దార్శ‌నిక‌త, ధృడ సంక‌ల్పం ఆయ‌న‌లో పుష్క‌లంగా ఉంటాయ‌ని కొనియాడారు. తెలంగాణ ఉద్య‌మం నుంచి ఆయ‌న రాజకీయ శైలిని నిశితంగా అర్థం చేసుకుంటున్నానని తెలిపారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డానికి ఆయ‌న అమ‌లు పరిచే విధానాలు, వాటి స‌ర‌ళి ఎంతో ప్ర‌భావితంగా ఉంటాయ‌న్నారు. అలాగే వేర్వేరు రాజ‌కీయ పంథాలు అనుస‌రించేవారు కూడా CM Kcrకేసీఆర్‌గారిని ఇష్ట‌ప‌డ‌డం.. ఆయ‌న‌లోని రాజ‌కీయ ప్ర‌జ్ఞ‌, పాట‌వాల‌కు నిద‌ర్శ‌మ‌న్నారు. కేసీఆర్ గారికి ఆరోగ్య‌క‌ర‌మైన దీర్ఘాయుష్షును ప్రసాదించాల‌ని ఆ భ‌గ‌వంతున్ని ప్రార్థిస్తున్న‌ట్లు ఆ లేఖ‌లో పేర్కొన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.‌