AK: ప‌వ‌ర్‌స్టార్ సినిమాలో అతిథిగా స్టార్ డైరెక్ట‌ర్‌..

AK: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, భ‌ళ్లాల‌దేవ రానా క‌లిసి న‌టిస్తున్న ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన అయ్య‌ప్పనుమ్ కోషియ‌మ్ రీమేక్‌గా వ‌స్తున్నా ఈ చిత్రానికి అప్ప‌ట్లో ఒక‌డుండే వాడు ఫేం సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి డైలాగ్స్ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ అందిస్తుండ‌గా.. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మాణంలో.. ఎస్ ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

pk ak

అయితే AK ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో వినాయ‌క్ క‌నిపించ‌నున్నాడ‌ట‌.. దీనికి సంబంధించిన వార్తా ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. కానీ ఈ విష‌యంపై అధికారికంగా AK చిత్ర‌బృందం ప్ర‌క‌టించలేదు. మ‌రోవైపు వి.వి.వినాయ‌క్ శీన‌య్య అనే చిత్రంతో క‌థానాయ‌కుడిగా తొలి అడుగు వేశారు.. అలాగే బెల్లంకొండ శ్రీ‌నివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఛ‌త్ర‌ప‌తి సినిమా రీమేక్‌గా వ‌స్తున్నా చిత్రానికి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.