మొద‌లైన ప‌వ‌న్‌-క్రిష్ సినిమా షూట్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌రుస సినిమాల‌తో బిజీబిజీగా ఉన్నాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌కీల్‌సాబ్ చిత్రాన్ని థియేట‌ర్లో రిలీజ్ చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత చేయ‌బోయే చిత్రం మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్ చిత్రంలో న‌టిస్తుండ‌గా.. ఇందులో ప‌వ‌న్‌తో పాటు రానా కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అయితే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో క్రిష్‌కు క‌రోనా సోక‌డంతో షూటింగ్‌కు కొంత విరామం ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌.. అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్ చిత్రంలో న‌టిస్తున్నాడు.

pawan krish cinema

తాజాగా క్రిష్ క‌రోనా నుంచి పూర్తిగా కోలుకోవ‌డంతో మ‌ళ్లీ తిరిగి ప‌వ‌న్‌తో తీయ‌బోయే సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. ఈ సినిమా పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానుల‌కు భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమాను ఏఎం ర‌త్నం మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్‌లో నిర్మిస్తుండ‌గా.. నిన్న ఈ సిని‌మా షూటింగ్‌లో ప‌వ‌న్ లేకుండానే కొన్ని షాట్స్ ను తీసిన క్రిష్ నేటి నుంచి ప‌వ‌న్ హాజ‌రు కాబోతున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమాలో ప‌వ‌న్‌ను ఒక దొంగ‌గా.. క్రిష్ చూపించ‌బోతున్న‌డ‌ట‌, ఇక ఈ సినిమా మొఘ‌గ‌లాయిల కాలం నాటిదిగా క‌థ ఉంటుంద‌ని చిత్ర‌బృందం చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న బాలీవుడ్ న‌టి జాక్వెలిన్‌ఫెర్నాండెజ్ న‌టిస్తుండ‌గా.. ఎం.ఎం. కీర‌వాణీ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కురుస్తున్నారు.