ప‌వ‌ర్‌స్టార్-క్రిష్ కాంబో మూవీ రిలీజ్ అప్‌డేట్.. సంక్రాంతి బ‌రిలో ప‌వ‌ర్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాన్, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి కాంబినేష‌న్‌లో పీఎస్‌పీకే27 వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత ఏ.ఎమ్‌.ర‌త్నం నిర్మిస్తుండ‌గా.. ఇందులో ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌, ప్ర‌ముఖ న‌టుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించి ప‌వ‌న్ లుక్స్ లీక్ అయ్యాయి.. ఈ లుక్‌లో ప‌వ‌న్ స‌రికొత్తగా క‌నిపించాడు..

pavan krish

ఈ లుక్ ఎంతో అల‌రిస్తోంది. దీంతో ఈ సినిమాపై ప‌వ‌న్ అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రం సంబంధించి ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్‌ను మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. కాగా ఈ సినిమా కోసం చార్మినర్‌, భారీ సంస్థానం సెట్స్ నిర్మించారు. వీటికి సంబంధించిన షూట్స్ వీడియోలు లీక్ అయి సోష‌ల్ మీడియాలో హాల్‌చ‌ల్ అవుతున్నాయి. తాజాగా స‌రికొత్త అప్‌డేట్‌ను ప్ర‌క‌టించింది చిత్ర‌బృందం.. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుండ‌గా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది 2022లో సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. పీరియాడిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్న చిత్రంలో ప‌వ‌న్ రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు.