Powerstar: ప‌వ‌ర్‌స్టార్‌తో బిగ్‌బాస్ ఫేం‌.. ఓ మై గాడ్ అంటూ ట్వీట్‌!

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాల్లో ఇప్పుడున్న ఆర్టిస్ట్‌లకు అవ‌కాశం వ‌స్తే వాళ్లు ఎగిరి ఎగిరి గంతులేస్తారు.. వారి సంతోషానికి అవ‌ధుల్లేకుండా పోతాయి.. త‌న అభిమాన న‌టుడు ప‌వ‌ర్‌స్టార్‌తో ఒక్క సీన్‌లోనైనా క‌నిపించాలని ఎంతోమంది ఆర్టిస్ట్‌లు కోరుకుంటారు. తీరా ఆ స‌మ‌యం వ‌స్తే.. ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతారు. ఈ క్ర‌మంలోనే బిగ్‌బాస్ ఫేం న‌టికి ఆ అవ‌కాశం ద‌క్కింది. ఇంత‌కీ ఎవ‌రంటే.. ప‌లు సీరియ‌ల్స్‌ల్లో, బిగ్‌బాస్ షోతో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న న‌టి హిమ‌జ‌..

Pavan krish

అవును ఏకంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాల్లో న‌టించే ఛాన్స్ హిమ‌జ‌. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్ రూపొందిస్తున్న చిత్రంలో ప‌వ‌న్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.Powerstar ఈ సినిమాలో ఓ పాత్ర‌కు హిమ‌జ ఎంపికైంది. దీంతో త‌న అభిమాన న‌టుడితో న‌టిస్తున్నాన‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది హిమ‌జ‌.. ఓ మై గాడ్‌.. ఈ రోజు నా క‌ల నెర‌వేరింది. Powerstarప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారిని తొలిప్రేమ సినిమాలో చూసిన‌ప్పుడు ఆయ‌న్ని క‌నీసం నేరుగానైనా చూస్తానా అనుకున్నా.. కానీ ఇప్పుడు ఏకంగా ఆయ‌న సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్ట‌ర్ క్రిష్‌గారికి కృత‌జ్ఞ‌త‌లు.. Powerstarప‌వ‌న్ స‌ర్ మీతో క‌లిసి న‌టించ‌డాన్ని ఓ గౌర‌వంగా భావిస్తున్న అంటూ హిమ‌జ త‌న సంతోషానికి అవ‌ధులు లేకుండా పోయాయి అంటూ పోస్ట్ చేసింది. ఇక ఈ సినిమాకు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే టైటిల్‌ను ఫిలింఛాంబ‌ర్లో రిజిస్ట‌ర్ చేయించార‌ని స‌మాచారం. ఇందులోPowerstar ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు అర్జున్ రాంపాల్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత ఏ.ఎమ్‌ ర‌త్నం నిర్మిస్తుండ‌గా.. ఎం.ఎం కీర‌వాణీ ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నారు.