Powerstar: పీపుల్ ఫ్యాక్టరీతో మూవీస్‌ను నిర్మించ‌నున్న ప‌వ‌న్‌.. అంద‌రి హీరోలతో చేస్తా..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ల్టీటాలెంట‌డ్ ప‌ర్స‌న్ అని మ‌న‌కు తెలిసిన విష‌యమే. ఆయ‌న ఏమి చేసిన త‌న‌దైన శైలిలో అంద‌రినీ ఆక‌ట్టుకుంటాడు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అయినా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీతో క‌లిసి సినిమాల‌ను నిర్మించాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నారు. కొత్త త‌రం ద‌ర్శ‌కుల‌ను, ర‌చ‌యిత‌ల‌ను ప్రోత్సాహించాల‌నే ఉద్దేశ్యంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదివ‌ర‌కే ఆయ‌న‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై ప‌లు సినిమాలు నిర్మించారు..

అయితే యంగ్ టాలెంట్‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌డం కోసం ప‌వ‌న్ క‌ళ్యాన్ క్రియేటివ్ వ‌ర్క్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్లు సంయుక్తంగా 15సినిమాల‌ను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందులో 6చిన్న సినిమాలు, 6మీడియం బ‌డ్జెట్ సినిమాలు, 3భారీ చిత్రాలు నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబంధించిన త‌దిత‌ర విష‌యాల‌ను ఎప్ప‌టిక‌పుడు వెల్ల‌డిస్తామ‌ని వారు తెలిపారు.