భగీరథకు పత్రికారత్న అవార్డు

భగీరథకు పత్రికారత్న అవార్డు : ఎన్ .టి .ఆర్ శత జయంతి సందర్భగా కమలాకర లలిత కళాభారతి సంస్థ సీనియర్ జర్నలిస్ట్ భగీరథ ను పత్రికారత్న తో సత్కరించింది.
హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ ఆడిటోరియం లో బుధవారం రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కె .వి .రమణ , ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ , ఓలేటి పార్వతీశం , డాక్టర్ కె .వి .కృష్ణకుమారి, ఆచార్య గౌరీ శంకర్ ,శ్రీమతి భారతీదేవి పాల్గొన్నారు . జర్నలిస్ట్ భగీరథ తో పాటు రంగస్థల నటుడు గుమ్మడి గోపాల కృష్ణ, నటరత్న , నృత్య కళాకారిణిడాక్టర్ వనజా ఉదయ్ కు నాట్యరత్న అవార్డు తో ఘన సత్కారం జరిగింది .


ఈ సందర్భంగా రమణాచారి , బుద్ధ ప్రసాద్ , కృష్ణకుమారి , గౌరీ శంకర్ , ఎన్ .టి .ఆర్ తో తమకున్న అనుబంధాన్ని వివరించారు .
జర్నలిస్ట్ భగీరథ మాట్లాడుతూ – 1977 నుంచి ఎన్ .టి .రామారావు గారితో తనకు పరిచయం ఉందని, ఆయన లోని మానవతా కోణాన్ని , సామాజిక సేవను వివరించాడు . ఎన్ .టి .ఆర్ శత జయంతి సందర్భగా తనకు ఈ అవార్డును ప్రదానం చేసిన కమలాకర లలిత కళాభారతి సంస్థ నిర్వాహకురాలు భారతీదేవికి కృతజ్ఞతలు తెలిపాడు