సైరా విజయం మీకే అంకితం మాస్టారు…

ఎన్నో ఏళ్లుగా మిగిలిపోయిన కల నెరవేరితే ఎలా ఉంటుంది? ఆ కల నిజమైన రోజు ఎంత సంతోషంగా ఉంటుంది? ఈ ప్రశ్నలకి సమాధానం పరుచూరి బ్రదర్స్ ని అడిగితే పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తారు. ఎందుకంటే సైరా కథతో మిగిలిన అందరూ రెండేళ్ల మాత్రమే ప్రయాణం చేస్తే, ఈ సోదరులు మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథలో నటిస్తే అనే కలని కన్నారు. అదే కలని మోస్తూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో 14 ఏళ్ల పాటు సావాసం చేసింది పరుచూరి సోదరులు మాత్రమే. దేశం మర్చిపోయిన వీరుడు కథని సినిమాగా చేయాలి అనే ఆలోచనతో పరుచూరి బ్రదర్స్ సిద్ధం చేసిన కథ వాళ్లకి కలగానే మిగిలిపోయింది. ఆ కల వాళ్లని దాదాపు దశాబ్దమున్నర వెంటాడింది. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ సైరా రూపంలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

సైరాకి ఆల్ సెంటర్స్ లో పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్, మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే వీరందరి కన్నా సైరా సినిమా విజయంతో పరుచూరి బ్రదర్స్ చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉండి ఉంటారు. అక్టోబర్ 2, పరుచూరి సోదరుల పద్నాలుగేళ్ల కల నిజమైన రోజు. సైరా సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసిన పరుచూరి సోదరులలో ఒకరైన గోపాలకృష్ణ తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. పద్నాలుగేళ్ల మా కలను సాకారం చేసిన మెగాస్టార్‌కి, ఆయన కడుపున పుట్టిన పులిబిడ్డ రామ్‌చరణ్‌కి వందనం’ అంటూ జీకే ట్వీట్ చేశారు. ఈ సైరా విజయం మీకే అంకితం పరుచూరి సోదరులారా…