Bollywood: క‌రోనా వ్యాక్సిన్ తీసుకోన్న కొన్ని రోజుల‌కే బాలీవుడ్ న‌టుడికి క‌రోనా..

Bollywood: ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు ప‌రేశ్ రావల్ క‌రోనా బారిన ప‌డ్డారు. దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.. ఈ నేప‌థ్యంలో సామాన్యుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా న‌టుడు ప‌రేశ్ రావ‌ల్‌కు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా ట్వీట్ చేశారు. దురదృష్ట‌వ‌శాత్తూ నాకు క‌రోనా సోకింది.

గ‌త ప‌ది రోజుల్లో న‌న్ను క‌లిసిన వారు త‌ప్ప‌కుండా క‌రోనా టెస్ట్ చేయించుకుండి అంటూ ట్వీట్ చేశారు. కాగా ప‌రేశ్ రావ‌ల్ మార్చి 9న క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.. దీంతో ఆయ‌న అప్పుడు ట్వీట్ చేస్తూ.. వీ అంటే వ్యాక్సిన్.. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో ప‌నిచేసిన డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఫ్రంట్ లైన్ వారియ‌ర్‌ల‌కు ధ‌న్య‌వాదాలు అంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.‌