సీనీ కార్మికుల కు అండగా నిలబడిన పరారి మూవీ హీరో యోగీశ్వర్

కరోనా విపత్కర కాలంలో సినీ కార్మికులు పడుతున్న ఇబ్బందులకు తమ వంతు సాయం
అందించేందుకు పరారి చిత్ర బృదం ముందుకు వచ్చింది. పరారి సినిమాతో హీరోగా
పరిచయం అవుతున్న యోగీశ్వర్ చేతుల మీదుగా 24 క్రాప్ట్స్ కి సంబంధించిన
వర్కర్స్ కి నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. షూటింగ్స్ లేక
ఇబ్బందులు ఎదుర్కొంటున్న చాలా మంది కార్మికులు యోగీశ్వర్ అండ్ టీం
చేస్తున్న సహాయం అందుకొని టీం కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత గిరి, హీరో యోగీశ్వర్ , నటుడు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా హీరో యోగీశ్వర్ మాట్లాడుతూ:
‘కరోనా అనేది ఎవరూ ఊహించని విపత్తు అందరూ సేఫ్ గా ఉండాలి అని
కోరుకుంటున్నాను. మా సినిమా తరుపున ఈ కష్ట సమయంలో ఏదైనా సహాయం చేద్దాం
అనే ఆలోచన కలిగింది. మా నాన్న (నిర్మాత) గిరి గారు నిత్యావసరాలు పంపిణీ
చేద్దాం అన్నారు. హీరో సుమన్ గారు కూడా ఈ ఆలోచనను అభినందించారు. వారి
ప్రోత్సాహాంతో ఈ నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నాం.. త్వరలో షూటింగ్స్
ప్రారంభం అవుతారు. థియేటర్స్ దగ్గర మామూలు పరిస్థితులు కనిపిస్తాయని
నమ్ముతున్నాను . ఇలాంటి కార్యక్రమంలో పాల్గోన్నందుకు చాలాసంతోషంగా ఉంది’
అన్నారు.

నిర్మాత గిరి మాట్లాడుతూ:
‘ నేను సుమన్ గారి కి అభిమానిని ఆయన ప్రొత్సాహంతోనే నిర్మాతగా మారాను.
ఇప్పుడు కరోనా తో చాలా మంది సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వారి
కి సాయం చేయాలని ఆలోచన నుండి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం.. దాదాపు 250
మందికి పైగా సినీ కార్మికులకు ఈ రోజు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాం..
ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు.

నటుడు శ్రవణ్ మాట్లాడుతూ:
‘ కరోనా అందరి జీవితాలను ఒక కుదుపు కుదిపింది. ముఖ్యంగా సినీ రంగంలో
కార్మికులకు ఇది మరింత కష్టకాలం.. వీరికి సహాయం చేసేందుకు పరారి టీం
ముందుకు రావడం చాలా అభినందించతగ్గ విషయం.. ఈ టీం లో నేను భాగం అయినందుకు
చాలా గర్వంగా ఉంది’ అన్నారు.
మ్యూజిక్ దర్శకుడు మోహిత్ రెహ్మానియాక్ మాట్లాడుతూ:
‘ పరారి మూవీ టీం కార్మికులకు అండగా నిలబడినందుకు నా అభినందనలు.. కరోనా
విపత్కర కాలంలో కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేయడం చాలా ఆనందంగా
ఉంది. షూటింగ్స్ లేకపోతే కార్మికులకు రోజు గడవడం చాలా కష్టంగా
మారుతుంది. 24 క్రాప్ట్స్ కి సంబంధించిన కార్మికులకు నిత్యావసరాలు
అందించడం జరిగింది. ’ అన్నారు…

నటుడు అమిత్ మాట్లాడుతూ :
‘ సినీ కార్మికులకు అండ గా నిలబడిన పరారి టీం కి కృతజ్ఞతలు. ఈ కష్ట
కాలంలో సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువులు
అందించడం చాలా మంచి పని .ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందం గా
ఉంది అన్నారు.