మాస్ డైరెక్టర్  వి.వి వినాయక్ చేతుల మీదుగా విడుదలైన  వెంప కాశీ  “పంచనామ” ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్

వెంప కాశీ గారు పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ క్రియేషన్ చిత్ర యూనిట్ మాస్ డైరెక్టర్  వి.వి వినాయక్ గారు చేతుల మీదగా పంచనామ సినిమా కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ లాంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలో ట్రైలర్ కూడా గ్రాండ్ విడుదల చేయాలనుకుంటు న్నామని తెలిపారు.అనంతరం

వెంప కాశీ గారి గురుంచి వి.వి వినాయక్ గారు మాట్లాడుతూ.. వెంప కాశీ గారిని ఎన్నోసార్లు సినిమాలో నటించమని అడిగినా చెయ్యని వ్యక్తి పంచనామ అనే సినిమాలో చేశారు అని వినగానే షాక్ కి గురి అయ్యాను. అసలు ఈ సినిమా ఎందుకు చెయ్యవలిసి వచ్చింది క్యారెక్టర్ ఏంటి ఆ డైరెక్టర్ చెప్పిన విధానం ఏంటి ఎలా ఒప్పించారని చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. కనుక ఆ క్యారెక్టర్ విన్న తరువాత అప్పుడు అనిపించింది ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటు డైరెక్టర్ సిగటాపు రమేష్ నాయుడుకి నా మనస్పూర్తిగా దీవెనలు తెలుపుతున్నాను. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది కనుక ఆ పోస్టరే చెబుతుంది ఈ సినిమా ఎంత కసిగా చేసారని. పంచనామ చిత్ర యూనిట్ సబ్యులఅందరికి నా అభినందనలు తెలుపుతున్నాను.

పంచనామ చిత్ర డైరెక్టర్ సిగటాపు రమేష్ నాయుడు  మాట్లాడుతూ.. మా “పంచనామ” చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది..త్వరలో ట్రైలర్ కూడా గ్రాండ్ విడుదల చేయాలను కుంటున్నాము.మా సినిమా టైటిల్ కు మంచి అప్లాజ్ వచ్చింది.ముందు ముందు మంచి మంచి అప్లాజ్స్ రావాలని కోరుకుంటున్నాను. వి.వి వినాయక్ గారు చాలా బిజీగా ఉన్నా కూడా ఆయన చేతులు మీదగా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనని నేను బ్రహ్మ అని పిలుచుకుంటాను. నాకు ఇష్టమైన డైరెక్టర్స్ లో వి.వి వినాయక్ గారు ఒకరు ఆయన ఇచ్చిన దీవెనలు నాలో మరింత పాజిటివ్ ఎనర్జీ నింపాయి. వి.వి వినాయక్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ ..మా చిత్ర టైటిల్ కు మంచి రెస్పాన్ద్ వచ్చింది. అదేవిధంగా ఫస్ట్ లుక్ కు టీజర్ కు కూడా అదే రెస్పాన్స్ వస్తుంది.మా చిత్ర టీజర్ ను వి.వి వినాయక్ గారు లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.
నటీనటులు
త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ జాదవ్, ముక్కు అవినాష్, ఆలపాటి లక్ష్మి, ఆంజనేయులు (జూనియర్ రాజశేఖర్ )తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : హార్దిక్ క్రియేషన్స్
నిర్మాతలు : గద్దె శివ కృష్ణ మరియు వెలగ రాము
రచన దర్శకత్వం స్క్రీన్ ప్లే డైలాగ్స్ : సిగటాపు రమేష్ నాయుడు
ఎడిటర్ : బసవ రెడ్డి
సినిమాటోగ్రఫీ : పవన్ గుండుకు
సంగీతం : ప్రదీప్ చంద్ర
పి ఆర్ ఓ : మధు