మూడో తరం వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు

హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సినీ దిగ్గజం ధర్మేంద్ర. నిన్నటి తరం సినీ అభిమానలందరినీ అలరించిన ధర్మేంద్ర నట వారసులుగా సన్నీ డియోల్, బాబీ డియోల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రి నట వారసత్వాన్ని ముందుండి నడిపించిన ఈ ఇద్దరూ బాలీవుడ్ లో సెపరేట్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోవడంలో కంప్లీట్ గా సక్సస్ అయ్యారు. ఇప్పుడు డియోల్ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. సన్నీ డియోల్ కొడుకైన కరణ్ సింగ్ డియోల్ హీరోగా పరిచయం అవుతూ చేస్తున్న సినిమా పల్ పల్ దిల్ కే పాస్. సహీర్ బంబ్బా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సన్నీ డియోలే స్వయంగా డైరెక్ట్ చేయడం విశేషం. ధర్మేంద్ర ప్రొడ్యూసరు చేస్తున్న ఈ పల్ పల్ దిల్ కే పాస్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. డియోల్ మూడో తరం వారసుడిగా కరణ్ మొదటి సినిమానే మంచి లవ్ స్టోరీ చేసినట్లు ఉన్నాడు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకి రానున్న పల్ పల్ దిల్ కే పాస్ ట్రైలర్ ని మీరూ ఒకసారి చూసేయండి.