ఘనంగా హీరో పైడి జయరాజ్ గారి 113 వ జయంతి

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత జయంతి వేడుకలు…. తెలంగాణ లెజెండరీ హీరో పైడి జయరాజ్ గారి 113 వ జయంతి సందర్భంగా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాలులో 28-09-22 వ తేదీ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.. కార్యక్రమం నిర్వాహకులు జైహింద్ గౌడ్, శ్రవణ గౌడ్ మరియు హాజరైన సినీ ప్రముఖులు నటుడిగా, దర్శకుడుగా సినీ పరిశ్రమలో ఆయన గొప్పతనాన్ని కొనియాడారు.. నిర్వాహకులు జైహింద్ గౌడ్ , శ్రవణ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణా గర్వించతగ్గ ఆర్టిస్ట్ పైడి జయరాజని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఆర్టిస్ట్ ఎదగాలని, ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం జయంతి రోజున అవార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ మోహన్ వడ్లపట్ల, జాయింట్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి నిర్మాతల మండలి ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్టిస్టులు కవిత, కరాటే కళ్యాణి, మాణిక్, రోషం బాలు, నిర్మాతలు కంకణాల శ్రీనివాస రెడ్డి, రమేష్ నాయుడు, రవీంద్ర గోపాల, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు..