ఏప్రిల్‌ 30న వస్తున్న ‘పాగ‌ల్’

టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ ఇటీవ‌ల హిట్ చిత్రంలో మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం విశ్వ‌క్‌సేన్ హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పాగల్. మ్యాజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది.

pagal release date

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ రోజు పాగ‌ల్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల‌చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ పోస్ట‌ర్‌లో విశ్వ‌క్‌సేన్ యూబ‌ర్‌కూల్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో గులాబిపూలు ప్రేమ‌ను, స్వ‌చ్చ‌త‌ను సూచిస్తున్నాయి. ర‌ధ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి ఎస్ మ‌ణికంద‌న్‌ అందిస్తుండగా.. ఎడిటింగ్ గ్యారీ బీహెచ్‌ చేస్తున్నారు.