మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డ్

ఈరోజు కేంద్ర హోమ్ అఫైర్స్ శాఖ నుండి ప్రెస్ నోట్ విడుదల కావడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ లో దేశం లోనే అత్యంత గర్వించదగ్గ జాతీయ పురస్కారాలు అయినా పద్మ విభూషణ్, పద్మ భూషణ్ , పద్మశ్రీ అవార్డు గ్రహీతల పేర్లు వెల్లడించడం జరిగింది. అయితే సామాన్యంగా ఈ అవార్డులు వివిధ రంగాలను అనుసరిస్తూ సత్కరించడం జరుగుతుంది.
కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వ్యాపార అండ్ పరిశ్రమలు, విద్య, వైద్యం, క్రీడ, ఇంకా వివిధ రంగాలలో ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ సంవత్సరం మన దేశ ప్రెసిడెంట్ నుండి వచ్చిన 132 అవార్డులలో 5 పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి.


అలా ఈ సంవత్సరం వచ్చిన పద్మ విభూషణ్ అవార్డులలో మన తెలుగు వారైనా చిరంజీవి గారికి రావడం మన తెలుగు వారికి గర్వకారణం. అయితే గతంలోనే ఆయనకు పద్మ భూషణ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశంలో వచ్చిన 5 పద్మ విభూషణ్ అవార్డులలో ఒక అవార్డు చిరంజీవి గారికి రావడం గర్వకారణం. కళ రంగంలో చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కడం జరిగింది. ఈ విష్యం తెలియగానే చిరంజీవి గారు తన సోషల్ మీడియా X ద్వార కృతజ్ఞతలు తెలిపారు. తనకి ఈ అవార్డు రావడానికి కారణమైన ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ, తనకి ఈ గౌరవాన్ని ప్రసాదించిన భారత ప్రభుత్వానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు సాధించిన ఘనత తన ఒక్కరిదే కాదని, తనకు ఇన్నేళ్లు వెన్నెంటే నిలిచినా ప్రజలది అని, ఈ అవార్డు తన అభిమానులలో సొంతం అని తెలిపారు.
అలాగే తమిళనాడు చెందిన వైజయంతిమాలా బాలి, పద్మ సుబ్రహ్మణ్యం గారికి కళ రంగంలోనూ, అదే విధంగా ప్రజా వ్యవహార రంగంలో మన తెలుగు వారైనా వెంకయ్య నాయుడు గారికి, ఇంకా బీహార్ కు చెందిన బిందేశ్వర్ పథక్ గారికి సామాజిక సేవ రంగంలోనూ పద్మ విభూషణ్ అవార్డు సత్కారం లభించింది.