రామ్‌చ‌ర‌ణ్‌కి త‌న ఆటోబ‌యోగ్ర‌ఫీ ‘నేను’ కాపీ అంద‌జేసిన ప‌ద్మ‌శ్రీ బ్ర‌హ్మానందం !!

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ని ప‌ద్మ‌శ్రీ బ్ర‌హ్మానందం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. బ్ర‌హ్మానందం జీవితంలోని అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో, అనుభ‌వాల‌తో ప్ర‌చురిత‌మైంది ‘నేను’. బ్ర‌హ్మానందం ఆటోబ‌యోగ్ర‌ఫీగా విడుద‌లైన నేను పుస్త‌కానికి బ్ర‌హ్మానందం అభిమానుల్లోనూ, సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా, పుస్త‌క ప్రియుల్లోనూ మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. నేను ఆటోబ‌యోగ్ర‌ఫీ గురించి ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి కూడా మ‌న‌సారా అభినందించారు. బ్రహ్మానందం కృషిని ప్ర‌శంసించారు.

తాజాగా గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కి త‌న ఆటోబ‌యోగ్ర‌ఫీ నేను ను బ‌హూక‌రించారు ప‌ద్మ‌శ్రీ బ్ర‌హ్మానందం. నేను పుస్త‌కాన్ని అందుకున్న రామ్‌చ‌ర‌ణ్ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. బ్ర‌హ్మానందంగారు త‌మ జీవితంలోని అనుభ‌వాల‌తో నేను' రాశారు. అత్య‌ద్భుత‌మైన ఆయ‌న జీవిత ప్ర‌యాణాన్ని ఇందులో సంక్షిప్తం చేశారు. అక్క‌డ‌క్క‌డా చ‌మ‌త్కారంతో, మ‌న‌సులోని ఎన్నెన్నో విష‌యాల‌ను ఇందులో రాసుకున్నారు. ఓ వైపు జీవిత పాఠాల‌ను నేర్పుతూ, అనుభ‌వాల‌ను పంచుకుంటూ, అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తూ, ఎన్నో సినిమాల సంగ‌తుల‌ను గుర్తుచేస్తూ, ఆద్యంతం అద్భుతంగా సాగింది ఈ పుస్త‌కం. బ్ర‌హ్మానందంగారు రాసిన ఆటోబ‌యోగ్ర‌ఫీ 'నేను' అంద‌రికీ అందుబాటులో ఉంది. ప్ర‌తి ఒక్క‌రూ చ‌ద‌వ‌ద‌గ్గ పుస్త‌కం ఇది అని ట్వీట్ చేశారు గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌.