Tollywood: విజ‌య్‌దేవ‌ర‌కొండ రిలీజ్ చేసిన ప‌చ్చీస్ టీజ‌ర్‌..

Tollywood: టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ ఇలా ప‌లు భాష‌ల్లో చెందిన సినీ ప్ర‌ముఖుల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేసిన రామ్స్ తొలిసారి హీరోగా న‌టిస్తోన్న చిత్రం ప‌చ్చీస్‌. ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో, ఫ‌స్ట్‌లుక్ ను నాగార్జున అక్కినేని చేతుల మీదుగా రిలీజ్ చేశారు. దీంతో ప్రేక్ష‌కుల్లో ఎంతో ఆక‌ట్టుకుంది.. ఇక తాజాగా ప‌చ్చీస్ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ మేర‌కు రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ చేతుల మీదుగా ఈ Tollywood చిత్ర టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు.

Pachchis Movie

ఈ సంద‌ర్బంగా చిత్ర‌బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు విజ‌య్‌. ఇక ఈ చిత్రానికి శ్రీ కృష్ణ, ర‌మా సాయి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.. ఇందులో శ్వేతావ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్ ప‌తాకాల‌పై కౌశిక్ కుమార్ క‌త్తూరి, ర‌మా సాయి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ Tollywood చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటుంది.. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించిందిTollywood.‌