

యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ మిడిల్ క్లాస్ ఆంథమ్ ‘ఏం బతుకురా నాది’ సాంగ్ వైరల్ అయ్యింది. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. పాంచ్ మినార్ టైటిల్ చాలా బాగుంది. గోవిందరాజు గారు చాలా పాషన్ ఉన్న వ్యక్తి. ఎలాగైనా సాధించాలి నిలబడాలనే కసి పట్టుదలతో ఈ సినిమాని తీశారు. కెమెరా వర్క్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. సినిమాని చాలా రిచ్ గా తీశారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డెఫినెట్ గా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకం ఉంది. ఈ సినిమాతో రాజ్ తరుణ్ కి కూడా బెస్ట్ స్టార్ట్ అవుతుందని నమ్ముతున్నాను. టీజర్ చూడగానే సినిమా హిట్ అవుతుందని నమ్మకం కలిగింది. మంచి సినిమా. డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాలని ఈ వేడుకకు రావడం జరిగింది. ప్రోడక్ట్ చాలా ప్రామిసింగ్ గా క్వాలిటీ గా ఉంది. చిన్న బడ్జెట్ లో క్వాలిటీ ప్రోడక్ట్ తీయడం అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి. అలాంటి కష్టం ఈ సినిమాకి పడ్డారు. ఇలాంటి మంచి సినిమాలు ఎంకరేజ్ చేయండి. గోవిందరాజు గారు అండ్ టీం ని బ్లెస్ చేయండి. అందరికీ థాంక్యూ సో మచ్’అన్నారు
నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడుతూ… ఈ సినిమా చాలా మంచి విజయాన్ని సాధించి అందరికీ మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గా పరిచయం అవుతున్న రామ్ గారికి అభినందనలు. శేఖర్ చంద్ర గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు . లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ గారు ఇందులో మంచి పాట రాశారు. హీరోయిన్ రాశి సింగ్ గారు తెలుగు నేర్చుకొని చాలా చక్కగా మాట్లడుతున్నారు. ఆమె మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ చూస్తుంటే చాలా పాజిటివ్ గా ఉంది. రాజ్ తరుణ్ టైమింగ్ చాలా బాగుంటుంది. ఈ సినిమాతో స్పాంటేనియస్ స్టార్ రాజ్ తరుణ్ అనే టైటిల్ ఇవ్వాలని నిర్మాతల్ని కోరుతున్నాను. తనది నేచురల్ టైమింగ్. తనకి ఇక్కడి నుంచి అన్ని మంచి శుభాలే జరగాలని కోరుకుంటున్నాను’అన్నారు


డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ… ఈ టీజర్ నాకు చాలా నచ్చింది. రాజ్ తరుణ్ నేను చాలా మంచి ఫ్రెండ్స్. శేఖర్ చంద్ర గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా దర్శకులకు నిర్మాతలకి నటీనటులందరికీ ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.’అన్నారు
డార్లింగ్ డార్లింగ్ స్వామి మాట్లాడుతూ.. గోవిందరాజు గారు డబ్బులు దగ్గర చాలా స్ట్రిక్ట్. ఈ సినిమాకి అంత డబ్బు పెట్టి తీశారు అంటే డెఫినెట్ గా సినిమా మంచి లాభాలు చేస్తుందని అర్థం. మా ఎస్ కే ఎన్ గారు విషయం లేనిదే ఏ ఫంక్షన్ కి రారు. ఆయన ఈ కథ విని వెంటనే రావాలని ఇక్కడికి రావడం జరిగింది. టీజర్ చాలా బాగుంది. ట్రైలర్ చూస్తే డెఫినెట్ గ సినిమాకు రావాలనిపిస్తుంది. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’అన్నారు
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం మారుతి గారు నా మొదటి సినిమా తర్వాత ఇప్పటివరకు నన్ను నమ్మి ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన ఈవెంట్ కి వచ్చి టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అని చెప్పడానికి కారణం మా డైరెక్టర్ కష్టం ఆయన విజన్. నిర్మాతలు ఈ సినిమాని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు. రాశి అమేజింగ్ యాక్టర్. అనంత శ్రీరామ్ గారు ఈ సినిమాలో చాలా చక్కని పాట రాశారు. బ్రహ్మాజీ గారితో కలిసి యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో నటించిన ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను. శేఖర్ చంద్ర ఎప్పట్లాగే చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము. మా సినిమాని థియేటర్స్ కి వచ్చి చూడండి. పైరసీ ని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. అందరికీ థాంక్యు’అన్నారు
హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మారుతి గారికి థాంక్యూ. టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను
ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సమ్మర్ లో మంచి ఎంటర్టైనర్ కావాలని కోరుకుంటున్నాను. రాజ్ తరుణ్, హీరోయిన్ రాశి సింగ్. అందరికీ మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. థాంక్యూ ఆల్ ది వెరీ బెస్ట్’అన్నారు.
యాక్టర్ బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా నవ్వుకున్నాను. షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా నవ్వుకున్నాను. చాలా మంచి సినిమా అవుతుంది. రాజ్ తరుణ్ చాలా నేచురల్ గా యాక్ట్ చేస్తాడు. ఫస్ట్ టైమ్ తనతో యాక్ట్ చేశాను. కాబట్టి డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ ఇస్తామని నమ్మకం ఉంది. ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని కోరుకుంటున్నాను’అన్నారు
విజయ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం .ఈ సినిమా మంచి విజయం సాధించాలని మంచి విజయం సాధించాలని అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్’అన్నారు
యాక్టర్ అజయ్ ఘోష్ మాట్లాడుతూబ.. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు దర్శకులకి ధన్యవాదాలు. మారుతి గారు ఒక సినిమా వెనుక ఉన్నారంటే అది తప్పకుండా విజయం సాధిస్తుంది .సినిమా చాలా బాగుంటుంది. మీ అందరిని బాగా నవ్విస్తుంది మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’అన్నారు
డైరెక్టర్ రామ్ కందుల మాట్లాడుతూ… అందరికి నమస్కారం. పాంచ్ మినార్ అంటే ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది. ఇందులో చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్ ఎనర్జీ మీ అందరికీ తెలుసు. చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. ఇది కం బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. రాశి సింగ్ చాలా చక్కని పెర్ఫార్మర్. తెలుగు చక్కగా నేర్చుకుని అద్భుతంగా నటించింది. మా సినిమాకి చాలా సపోర్ట్ చేసిన మారుతి గారికి థాంక్యూ వెరీ మచ్. ఈవెంట్ కి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు’అన్నారు
నిర్మాతలు ఎంఎస్ఎం రెడ్డి, గోవిందరాజు మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. మా సినిమాలో పనిచేసిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు అందరికీ ధన్యవాదాలు. మారుతి గారు సాయి రాజేష్ గారు ధీరజ్ గారు అందరూ టీజర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్. అందరినీ కడుపుబ్బ నవ్వించేలా ప్రయత్నం చేశాం. ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం’అన్నారు
లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కష్టాల్ని కామిక్ గా చెప్పే ఏ కథ కూడా నిరుత్సాహపరచదని పాంచ్ మినార్ నిరూపించబోతుంది. ఇందులో ఏం బతుకు రా పాట ప్రజల్లోకి వెళ్లి గొప్ప ఆదరణ పొందింది. నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్న సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది. మీరు కడుపుబ్బ నవ్వుకుంటూనే అప్పుడప్పుడు కంటి చమ్మ నీ తెచ్చే సినిమా ఇది. తప్పకుండా మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’అన్నారు. సినిమా యూనిట్ అంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.
నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరలు
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: కనెక్ట్ మూవీస్ LLP
సమర్పణ: గోవింద రాజు
రచన & దర్శకత్వం: రామ్ కడుముల
నిర్మాతలు: మాధవి, MSM రెడ్డి
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: ఆదిత్య జవ్వాది
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్ డైరెక్టర్: ‘బేబీ’ సురేష్ భీమగాని
డైలాగ్స్: గొరిజాల సుధాకర్
కో-డైరెక్టర్స్: పుల్లారావు కొప్పినీడి & టి రాజా రమేష్
పీఆర్వో: వంశీ శేఖర్