యువ హీరో గగన్ ( రాజా ది గ్రేట్. 118. ఇస్మార్ట్ శంకర్ ఫేం ) తో పాటు మణికంఠ, శ్యామ్ తదితరులు నటిస్తూ ఆర్.క్రియేటివ్ క్రాఫ్ట్స్ పతాకంపై రఘు తోట్ల నిర్మాతగా, ఎం.ఎం.నాయుడు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘టార్చర్’. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు శనివారం రామానాయుడు స్టూడియోలో జరిగాయి.
ఈ సందర్భంగా నిర్మాత రఘు తోట్ల మాట్లాడుతూ.. ఇది లేడీ ఓరియెంటెండ్ కథాంశం, హరి చెప్పిన స్టోరీ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాను. కథకు తగ్గట్లు మంచి ఆర్టిస్టులను ఎంపిక చేశాం. సెప్టెంబర్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నాం. మీరందరూ తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం అన్నారు.
దర్శకుడు ఎం.ఎం.నాయుడు మాట్లాడుతూ.. ఈ కథ కోసం చాలా రోజులుగా అందరం కష్టపడ్డాం. ప్రస్తుత సమాజంలో మహిళలలు ఎదుర్కొంటున్న పరిస్థితుల ఆధారంగా ఈ లేడీ ఓరియెంటెడ్ కథ రూపొందించడం జరిగింది, తప్పకుండా ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది అన్నారు.
హీరో గగన్ మాట్లాడుతూ.. ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ శారీరకంగానో, మానసికంగానో సమస్యలు ఎదుర్కొంటోంది. మనం అప్పుడప్పుడు పేపర్లోనో, టీవీ న్యూస్ లోనో చూస్తుంటాం, చాలా తక్కువ మంది మాత్రమే వారు పడ్డ వేదనను బయటకి చెప్పుకుంటున్నారు. అలాంటి ఓ మహిళ స్టోరీని తీసుకుని హరి, నాయుడు మంచి స్క్రిప్టును రెడీ చేశారు. ఈ కథ లైన్ వినగానే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ కరోనా సంక్షోభంలో కూడా ఈ సినిమాని తెరకెక్కించడానికి ముందుకొచ్చాం. ఈ సినిమాతో ఎం.ఎం. నాయుడు దర్శకులుగా తమ కెరీర్ ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా ద్వారా సమాజానికి చక్కని సందేశం ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ద్వారా అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు మరియు దర్శకులకు నా ధన్యవాదాలు అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్ మాట్లాడుతూ.. లేడీ ఓరియెంటెండ్ కథాంశంతో సాగే ఈ చిత్రానికి చక్కని సంగీతం అందించబోతున్నాం. దర్శకుడు, నిర్మాతలకు నా ధన్యవాదాలు అన్నారు.
ప్రముఖ నటులు దుర్గాప్రసాద్, శ్రీరామ్ సంతోషి, ప్రమీళ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత : రఘు తోట్ల, బ్యానర్ : ఆర్.క్రియేటివ్ క్రాఫ్ట్స్, దర్శకత్వం: ఎం.ఎం.నాయుడు, స్టోరీ : పి.హరి, సంగీతం : ప్రజ్వల్ క్రిష్, సినిమాటోగ్రఫీ: తరుణ్, పి.ఆర్.ఓ:లక్ష్మీ నివాస్, ప్రొడక్షన్ కంట్రోలర్ : విష్ణు వర్ధన్.