న‌వీన్ విజ‌య్ కృష్ణ `ఊరంతా అనుకుంటున్నారు` విడుదల తేదీ ఖరారు

Oorantha Anukuntunnaru Release Date

`నందిని నర్సింగ్ హోమ్` చిత్రంతో కథానాయకుడిగానే మంచి గుర్తింపు తెచ్చుకొన్న నవీన్ విజయ్ కృష్ణ హీరోగా బాలాజీ సానల దర్శకత్వంలో రోవాస్కైర్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `ఊరంతా అనుకుంటున్నారు`. సెన్సార్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసుకుని ఈ చిత్రం క్లీన్ `యు` స‌ర్టిఫికేట్‌ను పొందిన ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద‌ర్బంగా అక్టోబ‌ర్ 5న  విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా …
చిత్ర నిర్మాతలు‌ మాట్లాడుతూ “మా `ఊరంతా అనుకుంటున్నారు` చిత్రంవిందు భోజ‌నంలాంటి సినిమా. సినిమా చూసిన ప్రేక్ష‌కుల‌కు మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చూశామ‌ని గ్యారంటీగా ఫీల్ అవుతారు. కె.రాధాకృష్ణ‌గారి అద్భుత‌మైన సంగీతం, జి.ఎల్‌.ఎన్‌.బాబు బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌, సున్నితమైన ఫ్యామిలీ కామెడీతో పాటు జయసుధ- రావు రమేష్ ల మధ్య, నవీన్ విజయకృష్ణ – శ్రీనివాస్ అవసరాల మధ్య సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగించేలా దర్శకుడు బాలాజీ సానల చిత్రీకరించారు. ఈ పండ‌గలాంటి సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

న‌టీన‌టులు:

నవీన్ విజయకృష్ణ    
శ్రీనివాస్ అవసరాల
మేఘా చౌదరి
సోఫియా సింగ్
జయసుధ
కోటా శ్రీనివాసరావు
రావు రమేష్
అన్నపూర్ణమ్మ
రాజా రవీంద్ర
అశోక్ కుమార్, ప్రభావతి
జబర్దస్త్ రామ్
జబర్దస్త్ బాబి
గౌతంరాజు
అప్పాజీ
క్రాంతి

సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: బాలాజి సానల
నిర్మాతలు: శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్

డి.ఓ.పి.     : జి.ఎల్.ఎన్. బాబు
ఎడిటింగ్     : మధు
కొరియోగ్రఫీ  : భాను
మేకప్ : ప్రేమ్ రాజ్
స్టోరీ : శ్రీమంగళం, రమ్య
ఆర్ట్ : కృష్ణమాయ
ఫైట్స్ : రామ్ సుంకర
పాట‌లు: వనమాలి, పెద్దాడ మూర్తి, శ్రీహరి మంగళంపల్లి
కాస్ట్యూమ్ డిజైనర్ : భార్గవీ రెడ్డి
కాస్ట్యూమర్ : నాగరాజు
ప్రొడక్షన్ మేనేజర్ : సుబ్బు ఎస్
పి.ఆర్.ఓ. : వంశీ – శేఖర్