కొటి ఇర‌వై ల‌క్ష‌ల సెట్ లో “డిస్కోరాజా” షూటింగ్

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజాష‌.  ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణా ఏడెక‌రాల‌లో కొటి 20 ల‌క్ష‌ల రూపాయిల సెట్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకి ఈ సెట్ చాలా కీల‌క‌పాత్ర పోషిస్తుంది.

ఈ షెడ్యూల్ లో ర‌వితేజ‌, వెన్నెల కిషోర్‌, శశిర్ ష‌ర‌మ్‌, టోనిహొప్ లపై సినిమాలో అతి కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ సెట్ ని డైర‌క్ట్ గా దియెట‌ర్ లో చూస్తే ప్రేక్ష‌కులు ఫీలింగ్ కొత్త గా వుంటుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆలోచ‌న.  ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

నేల టిక్కెట్ తర్వాత ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి… రవితేజ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. త్వ‌ర‌లో ఢిల్లి లో ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ… నేల టిక్కెట్ తర్వాత మాస్ మహారాజా రవితేజ గారితో మేం నిర్మిస్తున్న రెండో చిత్రం డిస్కోరాజా.

ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో రవితేజ గారు, వెన్నెల కిషోర్ ల మ‌ద్య జ‌రిగే కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాము. ఈ షెడ్యూల్ ఈ నెల 26 లో ఈ షెడ్యూల్ పూర్తిచేసుకుంటాము..

అగ‌ష్టు మెద‌టివారం  నుండి ఢిల్లి లో షూటింగ్ జ‌రుపుకుంటాము. ఈ షెడ్యూల్ లో న‌భా న‌టేష్ జాయిన్ అవుతారు. ద‌ర్శ‌కుడు వి ఐ ఆనంద్ చాలా గొప్ప విజ‌న్ వున్న వ్య‌క్తి. ఈ చిత్రం పూర్తి వినోదాత్మ‌కంగా విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విప‌రీతం గా ఆక‌ట్ట‌కుంటుంది. అని న‌మ్ముతున్నాము.. అని అన్నారు

న‌టీన‌టులు 
ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం 
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత : రామ్ త‌ళ్లూరి
ద‌ర్శ‌కుడు : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫ‌ర్  : సాయి శ్రీరామ్
డైలాగ్స్ : అబ్బూరి రవి
మ్యూజిక్ : థ‌మన్
ఎడిట‌ర్ : న‌వీన్ నూలి
పీఆర్ఓ : ఏలూరు శ్రీను