సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పై వస్తున్న మరో చిత్రం “సైకో వర్మ” వీడు తేడా..టాగ్ లైన్ . గతంలో నిర్మాతగానే,కాకుండా పలు సినిమాలకు దర్శకత్వం వహించిన నట్టి కుమార్ మళ్ళీ మెగా ఫోన్ పట్టి దర్శకుడుగా మారడం విశేషం.పలు చిత్రాలను నిర్మించిన తన కొడుకు,నిర్మాత నట్టి క్రాంతిని ఈ సైకో వర్మ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాడు. శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్వీటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ ,అనురాగ్ కంచర్ల లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నట్టి క్రాంతి,కృష్ణ ప్రియ,సంపూర్ణ మలకర్ హీరో,హీరోయిన్లు.”సైకో వర్మ” చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన ప్రత్యేక గీతాన్ని నూతన సంవత్సర సందర్భంగా విడుదల చేసారు.అనంతరం
డైరెక్టర్ నట్టికుమార్ మాట్లాడుతూ.. సైకో వర్మ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన “పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి” అంటూ సాగే లిరికల్ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.సింగర్స్ కి, డైరెక్టర్ కి ఈ పాట మంచి పేరు తీసుకు వచ్చింది.
సైకో వర్మ సినిమాలో నట్టి క్రాంతి హీరోగా నటిస్తున్నాడు.తను చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి నాకు చాలా మంది ఫోన్ చేశారు.సింగిల్ టేక్ లో డాన్స్ పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉంది.పాటకు తగ్గట్టు డాన్స్ ,పాటకు తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేయడం అనేది చాలా మంచి విషయం,నటనలోని మెలకువలు తెలుసుకుంటూ నట్టి క్రాంతి ఇంకా మంచి మంచి అవకాశాలతో ముందుకెళ్లాలి. అసలు ఏమీ నేర్చుకోకుండానే క్రాంతి చాలా బాగా డ్యాన్స్ చేసాడు. నట్టి క్రాంతి డ్యాన్స్ చూస్తుంటే మొదటిసారి డాన్స్ చేస్తున్నట్లుగా అనిపించడం లేదు.గతంలో చాలా సినిమాలు చేసినటువంటి ఫీల్ కలిగేలా చేశాడు.కొత్త ఆర్టిస్ట్ అని ఎవరూ ఊహించరు.
రాహుల్ సిప్లిగంజ్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు గతంలో మేము ఒక సాంగ్ మేకింగ్ వదిలాము.ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము.ఆ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
నటీ,నటులు..
నట్టి క్రాంతి, కృష్ణ ప్రియ,సంపూర్ణ మలకర్,అప్పాజి,మీనా,రూపలక్ష్మి,చమ్మక్ చంద్ర,కబుర్లు నవ్యా,రమ్య
సాంకేతిక నిపుణులు
సమర్పణ … శ్రీధర్ పొత్తూరి
బ్యానర్ ..నట్టి ఎంటర్ టైన్మెంట్స్, క్వీటీ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత..నట్టి కరుణ ,అనురాగ్ కంచర్ల
దర్శకత్వం..నట్టి కుమార్
సంగీతం..యస్.ఏ.ఖుద్దూస్
పాటలు..రాహుల్ సిప్లిగంజ్
లిరిక్ రైటర్.. వెంకట్
పి.ఆర్.ఓ.మధు వి.ఆర్.