రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులకి అండగా ఓంకారం దేవి శ్రీ గురూజీ

తెలుగు సినిమా ఇండస్ట్రీ జూనియర్ ఆర్టిస్టులు మరియు టీవీ ఆర్టిస్టులు రెండు వందల మందికి ఈ రోజు కృష్ణా నగర్ లో జీ టీవీ ఓంకారం దేవి శ్రీ గురూజీ నిత్య అవసర సరుకులు పంపిణి చేసారు ….

ఈ సందర్బంగా ఓంకారం దేవి శ్రీ గురూజీ మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీ జూనియర్ ఆర్టిస్టులు మరియు టీవీ ఆర్టిస్టులు ఈ కరోనా కష్ట కాలం లో పనులు లేక ఇబ్బంది పడుతున్నారు వీళ్ళని మనం సినిమాలో మరియు టీవీ ల లో చూసి మనం చాలా ఆనందిస్తాము అలాంటిది వాళ్ళు ఇలాంటి ఇబ్బందులలో ఉండటం చూసి నాకు చాలా బాధ అనిపించింది కాబట్టి నా వంతు సాయంగా నిత్య అవసర సరుకులు అందచేస్తున్నాను ఇప్పుడు రెండు వందల మందికి అంద చేస్తున్నాము, అలాగే అందరకి ఒకే సారి ఇవ్వలేము కరోనా పరిస్థితులు దృష్ట్యా ఎక్కువ జనం గుమికూడదు కాబట్టి మరల మూడు రోజుల కి ఒక సారి మిగిలిన వారికీ అంద చేస్తాము. గతం లో కూడా నేను సేవ కార్యక్రమాలు చేశాను,యూనియన్ ప్రెసిడెంట్ స్వామి గౌడ్ గారి కి మరియు యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్ కుమార్ గారు నన్ను అడగగానే నేను నా వంతు సహకారం అందిస్తాను అని చెప్పటం జరిగింది.

ఈ కార్యక్రమం లోయూనియన్ ప్రెసిడెంట్ స్వామి గౌడ్ గారు మాట్లాడుతూ ఓంకారం దేవి శ్రీ గురూజీ గారు కరోనా ఫస్ట్ వేవ్ లో కూడా చాలా మంది కి సహాయం చేసారు మేము ఓంకారం దేవి శ్రీ గురూజీ ని అడగగానే చాలా పెద్ద మనసు తో ముందుకు వచ్చారు వారి కి మేము ఎప్పుడు రుణ పడి ఉంటాము అయన ఇంక మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలి అని కోరుకుంటున్నాను అని తెలియచేసారు .

యూనియన్ సెక్రెటరీ వల్లభనేని అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీ జూనియర్ ఆర్టిస్టుల కి మరియు టీవీ ఆర్టిస్టుల కి మేము అడగ గానే నిత్య అవసర సరుకులు రైస్ బ్యాగ్, కంది పప్పు, ఆయిల్ ప్యాకెట్, ఇంక నెల కు సరిపడా వంట సామాగ్రి ని కరోనా కష్ట కాలం లో ఓంకారం దేవి శ్రీ గురూజీ పంపిణి చేసారు ఈ సందర్బంగా ఓంకారం దేవి శ్రీ గురూజీ కి నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను అని చెప్పారు.