‘ఒక బృందావనం’ చిత్ర రివ్యూ

బొత్స సత్య రచనా దర్శకత్వంలో కిషోర్ తాటికొండ, వెంకట రేగట్టే, ప్రహ్లాద్ భూమినేని, మనోజ్ ఇందుపూరు నిర్మాతలుగా వ్యవహరిస్తూ బాలు, షిన్నోవాను నూతన నటీనటులుగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల ముందు కూర్చున్న చిత్రం ఒక బృందావనం. మే 23వ తేదీన మైత్రి మూవీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో శివాజీ రాజా, అన్నపూర్ణమ్మ, శుభలేఖ సుధాకర్, రూపా లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, శ్రీనివాస్ తదితర సీనియర్ నటీనటులు నటించారు. ఈ చిత్రానికి రాజ్ నల్లి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయగా సన్నీ, సాకేత్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ:
ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టి అమెరికాకు వెళ్లాలని ఆశయంతో చెందపాటి ఉద్యోగం చేసుకుంటూ తన అమెరికా ప్రయాణం కోసం కావలసిన ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నంలో ఉంటాడు హీరో బాలు. తన తల్లి కలలను తన ఆశయంగా మార్చుకుని పెళ్లి కావలసిన సమయంలో తనకు కాస్త సమయం కావాలని ఆ సమయంలో తన తల్లి కలను నెరవేర్చేందుకు ముందుకు వెళుతుంది హీరోయిన్ షిన్నోవా. చిన్నప్పటినుండి అనాధాశ్రమంలో పెరుగుతూ ఎవరు దత్తత తీసుకోవడానికి వచ్చినా కూడా నిరాకరిస్తూ ఎవరో వస్తారని ఓ వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది పాప నైనిక. అయితే ఈ ముగ్గురూ ఎలా కలుస్తారు? ఈ ముగ్గురూ కలిసి ప్రయాణించిన రోజులలో ఏం జరుగుతుంది? ఆ పాప అనాధ గాని మిగిలిపోతుందా లేదా తన వాళ్లను కలుసుకుంటుందా? బాలు తన జీవిత ఆశయంగా చేసుకున్న అమెరికా ప్రయాణం జరుగుతుందా లేదా? షిన్నోవా తన తల్లి ఆశయాన్ని నెరవేర్చి తన తండ్రి కోరుకున్నట్లు పెళ్లి చేసుకుంటుందా లేదా? ఈ ముగ్గురి ప్రయాణం వీడి జీవితాలలో తీసుకొచ్చే మార్పులు ఎటువంటి మలుపులు తిప్పుతాయి? చివరికి ఏం జరుగుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన:
హీరో బాలు (విక్రమ్) ఈ చిత్రం ద్వారా తొలి పరిచయమైనప్పటికీ ఎక్కడ కూడా కొత్త నటుడు అనే సందేహం రాకుండా ఎంతో నిబద్ధతతో నటించాడు. ఎమోషనల్ సీన్స్ దగ్గర నుండి డైలాగు డెలివరీ వరకు ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా, సహజంగా నటిస్తూ తనదైన ముద్రను వేసుకున్నాడు. అలాగే హీరోయిన్ షిన్నోవా(మహా) కూడా నటనకు కొత్త అయినప్పటికీ ఎక్కడ కూడా ఆ సందేహం రాకుండా తన పర్ఫార్మెన్స్ తో మెప్పించారు. ఎక్కడ కూడా తన పాత్రకు మించి ముందుకు వెళ్లకుండా ఎంతో బ్యాలెన్స్ గా తన పాత్రను పర్ఫార్మ్ చేస్తూ ముందుకు సాగారు. అలాగే చిత్రంలో కీలక పాత్ర పోషించిన పాప నైనిక చిత్రంలో తనదైన ముద్రను వేసుకుంది. నైనిక తో పాటు తన స్నేహితురాలుగా నటించిన మరో పాప కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మౌనిక అటు పర్ఫార్మెన్స్ తో పాటు ఇటు డైలాగ్స్ ఇంకా ఎక్స్ప్రెషన్స్ విషయంలో కూడా ఎక్కడ ఇతర నటీనటులకు తప్పకుండా పర్ఫార్మ్ చేసింది. అలాగే చిత్రంలో నటించిన శివాజీ రాజా, అన్నపూర్ణమ్మ, రూపా లక్ష్మి, మహేంద్ర తమ తమ పాత్రలో పరిధిలో ఎంతో అద్భుతంగా పెర్ఫామ్ చేస్తూ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చారు. అలాగే శుభలేఖ సుధాకర్ చిత్రంలో ఎంతో కీలకపాత్ర పోషించారు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పుకోవాలి. శుభలేఖ సుధాకర్ నటన చిత్రానికి బోనస్గా నిలిచింది. అలాగే చిత్రంలో నటించిన ఇతర నటీనటులు తమ తమ పరిధిలలో నటిస్తూ చిత్రానికి బలాన్ని చేకూర్చారు.

సాంకేతిక విశ్లేషణ:
చిత్ర దర్శకుడు బొత్స సత్య తాను రాసుకున్న కథను వెండి తెరపై ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చూపించడంలో విజయం సాధించారు. ఒక కొత్త రకమైన కథను చాలా సాధారణంగా ప్రేక్షకులకు అర్థం అయ్యేలా మెప్పించి తీయడం అనేది ఒక పరిశోధనని చెప్పుకోవాలి. కానీ అటువంటి పరిశోధన ఎంతో చాకచక్యంగా చేసి చూపించాడు దర్శకుడు. అలాగే విజువల్స్ విషయంలో డిఓపి పనితీరు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చాలావరకు లొకేషన్స్ న్యాచురల్ లొకేషన్లో కావడంతో ఆ లొకేషన్స్ యొక్క సీనరీ వెండితెరపై మరింత గొప్పగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. అలాగే చిత్రంలోని సీన్లకు తగ్గట్లు బిజిఎం వస్తే ప్రతి సీను డబల్ గా ఎంజాయ్ చేసే విధంగా బోనస్గా నిలిచింది. అటు ఎమోషనల్ సీన్స్ నుండి ఇటు లవ్ సీన్స్ వరకు ప్రతి సీన్లను ఒక ప్రసెంట్ విజయం అందించి సంగీత దర్శకులు తమదైన ముద్రలు వేసుకున్నారు. అలాగే చిత్రానికి పాటలు మరింత బలాన్ని చేకూర్చాయి. నిర్మాణ విలువలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇతర సాంకేతిక విషయాలలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన నిర్మాణం విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు అర్థమవుతుంది.

ప్లస్ పాయింట్స్:
కథ, నటీనటుల నటన, బిజిఎం

మైనస్ పాయింట్స్:
కొత్త నటీనటులు, రెండవ భాగం కొంచెం స్లోగా ఉండటం

సారాంశం:
ఇటీవల వచ్చిన చిత్రాల వలే కాకుండా ఎంతో ప్రశాంతంగా కుటుంబ సమేతంగా చూసే విధంగా ఒక బృందావనం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎంతో ఫీల్ గుడ్ మూవీలా నిలిచింది.