
తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో బోల్డ్ న్యూ క్యారెక్టర్ పోషిస్తున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రతి అప్‌డేట్‌తో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రను పోషిస్తుంది.
ఈరోజు, ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో చిత్ర యూనిట్ బోట్ లో ప్రయాణించి త్రివేణి సంగమం వద్ద నాగసాధువుల సమక్షంలో టీజర్‌ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.
చీకటి, కాంతి యొక్క పురాతన శక్తులు ఢీకొనే ప్రపంచం నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ టీజర్, సూపర్ నేచురల్ రోలర్‌కోస్టర్ రైడ్ గా అద్భుతమైన కథనాన్ని ప్రజెంట్ చేసింది. ఈ సినిమా ప్రధాన సంఘర్షణ ఒక రాక్షస శక్తి తిరిగి రావడం నుండి పుడుతుంది, దాని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని, ప్రపంచాన్ని అల్లోకల్లోలం చేయాలని చేయాలని నిశ్చయించుకుంది. తమన్నా భాటియా పోషించిన దైవిక నాగ సాధువు పాత్ర చీకటిని ఎదుర్కోవడానికి, మంచి రక్షించదానికి ముందుకు అడుగులు వేస్తుంది.
నాగ సాధువు పాత్రను తమన్నా పోషించిన తీరు అద్భుతమైనది. దైవిక శక్తి, ఉగ్రమైన సంకల్పం రెండింటినీ ప్రసరింపజేస్తూ, ఆమె ప్రజెన్స్ మంత్రముగ్ధులను చేస్తుంది. విలన్ గా వశిష్ట ఎన్ సింహ లుక్ టెర్రిఫిక్ గా వుంది. టీజర్ కథనంలో కీలక పాత్రధారులను కూడా పరిచయం చేస్తుంది, వీరిలో హెబ్బా పటేల్, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలు ఆసక్తికరంగా వున్నాయి.
అశోక్ తేజ నైపుణ్యం కలిగిన దర్శకత్వం, సంపత్ నంది పర్యవేక్షణలో, ఓదెల 2 ఒక గొప్ప సినిమాటిక్ విజన్‌గా అలరించబోతోంది. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను కథలో లీనమయ్యే అనుభవాన్ని కలిగించాయి. అజనీష్ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్ ఇంటన్సిటీని మరింత పెంచింది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉంది. అద్భుతమైన VFX వర్క్ విజువల్ ని మరింత గ్రాండియర్ గా ప్రజెంట్ చేస్తోంది. రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్షన్ కూడా ప్రధానంగా ఆకట్టుకుంటుంది. టీజర్ కి హ్యూజ్ రెస్పాన్స్ తో టాప్ ట్రెండింగ్ లో వుంది. నిర్మాతలు త్వరలో సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తారు.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ.. మహాకుంభమేళా జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఓదెల 2 సినిమా కూడా జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. నిర్మాత మధు గారికి థాంక్ యూ. ఈ సినిమాతో పుణ్యం, డబ్బు రెండు కలిసి వస్తాయని భావిస్తున్నాను. మహాకుంభమేళాలో ఈవెంట్ ఇంత గ్రాండ్ గా చేయడం మామూలు విషయం కాదు. సంపత్ గారి విజన్ ని డైరెక్టర్ అశోక్ గారు అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు. ఈ సినిమా లాంచ్ అయినప్పటిని నుంచి ఎదో మ్యాజిక్ ఫీల్ అయ్యాం. సంపత్ గారితో నాలుగు సినిమాకు చేశాను. కానీ ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా వుంటుంది. అజినీష్ మ్యూజిక్ ఈ సినిమాకి సోల్. వశిష్ట పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నా కెరీర్ లో ఇలాంటి టీజర్ లాంచ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్. త్రివేణి సంగమం మధ్యలో నిలుచుని ఈ టీజర్ ని అందరికీ సమర్పిస్తున్నాం. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూస్తారని కోరుకుంటున్నాను’అన్నారు
మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ.. ప్రేక్షకులు, భక్తులు ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చుస్తున్నారు. ఈ విషయంలో మా నిర్మాత మధు గారికి థాంక్ యూ. పరమ శివుని ఆశీస్సులు కోసం ఇక్కడి వచ్చాం. ఈ సినిమా ఆలోచన అవకాశం ఆ దేవుడు ఇచ్చినదే అని నమ్ముతున్నాను. సినిమాని కాశీలో లాంచ్ చేయడం, టీజర్ ని కుంభమేళాలో లాంచ్ చేయడం.. ఇదంతా ఆ శివుని దీవెన గా భావిస్తున్నాను. చాలా పాజిటివ్ ఎనర్జీని ఫీలౌతున్నాను. ఒక సినిమా టీజర్ లాంచ్ కి ఇంత భారీగా ఖర్చు చేసి ఇలాంటి అద్భుతమైన వేదిక ఏర్పాటు చేసి గొప్ప అవకాశం ఇచ్చారు. ఈ అదృష్టాన్ని ఇచ్చిన నిర్మాత మధు గారికి థాంక్ యూ. 140 సంవత్సరాలకి ఒకసారి మహాకుంభ మేళా ఎలా వచ్చిందో ఓదెల 2లాంటి సినిమాలు కూడా చాలా అరుదుగా వస్తాయి. ఓదెల 2 తో ఆడియన్స్ కి పెద్ద ఎక్స పీరియన్స్ ఇచ్చే అవకాశం ఇచ్చిన నిర్మాత మధుగారికి థాంక్ యూ. కథని కంటెంట్ నమ్మి చేస్తున్న సినిమా ఇది. వశిష్ట విశ్వరూపం ఇందులో చూస్తాం. అజినీష్ గారు తన బీజీఎం తో గూస్ బంప్స్ తెప్పిస్తారు. ఆయన ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అశోక్ తో పదేళ్ళుగా జర్నీ వుంది. ఓదెల సినిమా తనని డైరెక్టర్ గా పరిచయం చేయడానికే చేశాను. ఓదెల2తో తను బిగ్ డైరెక్టర్ అవుతారు. ఈ కథ తమన్నా కోసమే క్రియేట్ అయ్యింది. ఈ కథకు పూర్తి న్యాయం చేయగల యాక్టర్ తమన్నా. ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత నలభై డిగ్రీల ఎండలో కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా యాక్ట్ చేసింది. సినిమా ఒప్పుకున్న తర్వాత మాంసహారాన్ని మానేసింది. చాలా అంకితభావంతో పని చేసింది. అందరినీ మెస్మరైజ్ చేసింది. అమ్మోరు సినిమా చూసినప్పుడు సౌందర్య గారిని, అరుంధతి సినిమా చూసినప్పుడు అనుష్క గారిని ఎంత ఆరాధించమో అంత ఇష్టంగా తమన్నా ఈ సినిమాతో ప్రేక్షకుల హృదయాలకు దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను. అది తప్పకుండా జరుగుతుంది’అన్నారు.
యాక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. నాకు ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. సంపత్ గారికి రుణపడి వుంటాను. ఆయన చాలా అద్భుతమైన మనిషి. ఓదెల టీం అంటే ఒక ఫ్యామిలీ లాంటి ఫీలింగ్. ఇందులో నా క్యారెక్టర్ మెమరబుల్ గా వుంటుంది. తిరుపతి క్యారెక్టర్ విశ్వరూపం చూస్తారు. తమన్నా గారితో నటిచండం గ్రేట్ ఎక్స్ పీరియన్స్, మధు గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నిర్మించారు. టీం అందరికీ థాంక్. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ మాట్లాడుతూ.. కుంభమేళాలో టీజర్ లాంచ్ కావడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ సినిమా మ్యూజిక్ మాటల్లో చెప్పలేను. మీరు థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయాలి. ఈ సినిమా ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను. అందరికీ థాంక్ యూ’అన్నారు.
డైరెక్టర్ అశోక్ తేజ మాట్లాడుతూ.. నాకు ఓదెల రైల్వేస్టేషన్, ఓదెల 2 సినిమాల అవకాశం ఇచ్చిన సంపత్ నంది గారికి ఎప్పటికీ రుణపడి వుంటాను. నిర్మాత మధుగారికిమ తమన్నా గారి, అందరికీ థాంక్ యూ’అన్నారు.
నిర్మాత డి మధు మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఈ సినిమాని కాశీలో లాంచ్ చేసిన తర్వాత మా ఎక్స్పెక్టేషన్స్ అంతకంతకు పెరిగాయి. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం సంపత్ నంది స్టోరీ డైలాగ్స్ డైరెక్షన్ పర్యవేక్షణ. ప్రయరాజ్ లో టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. కుంభమేళా సమయంలో ఒక్కరు రావడానికికే సవాల్ తో కూడుకున్న సమయంలో ఇంతమందిని తీసుకొచ్చి ఎలా చేస్తారని అందరూ భావించారు. అయితే సక్సెస్ ఫుల్ గా మా ప్రొడక్షన్ టీమ్స్, ఇక్కడ లోకల్ వారి సహకారంతో ఈవెంట్ ని గ్రాండ్ గా చేయగలిగాం. ఇది థియేటర్ లో చూడాల్సిన మూవీ. తప్పకుండా ఆడియన్స్ థియేటర్స్ లో చూసి పెద్ద సక్సెస్ చేయాలి’అన్నారు.
తారాగణం: తమన్నా భాటియా, హెబా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: డి మధు
క్రియేటెడ్ బై : సంపత్ నంది
బ్యానర్లు: మధు క్రియేషన్స్ , సంపత్ నంది టీమ్‌వర్క్స్
దర్శకత్వం: అశోక్ తేజ
డిఓపి: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో